జగన్ కు చెందిన 'సరస్వతీ' ల్యాండ్స్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా ఆ భూముల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సమయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-01-23 04:00 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు చెందిన సరస్వతీ పవర్, ఇండస్ట్రీస్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ, ఎసైన్డ్ భూములు ఉన్నట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా ఆ భూముల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సమయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... ఏపీ మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతీ పవర్, ఇండస్ట్రీస్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో ఎసైన్డ్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ భూముల్లో ఉన్న ఈ ఎసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లను అధికారులు తాజాగా రద్దు చేశారు. ఈ మేరకు మాచవరం తహసీల్దార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇందులో భాగంగా... మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకారాలు ఎసైన్డ్ ల్యాండ్స్ ను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని.. అందువల్ల ఆ దస్తావేజులను రద్దు చేస్తున్నామని.. అందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కు విన్నవించామని.. ఇదే సమయంలో ఈ భూముల రిజిస్ట్రేషన్ రద్దుకు సబ్ రిజిస్ట్రార్ కు నివేదించినట్లు వెల్లడించారు.

కాగా... వేమవరం, పెన్నెల్లి, చెన్నపాలెం, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలను సరస్వతీ పవర్ ప్లాంట్ యాజమాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఈ సమయంలో.. వాటిలో అటవీ భూములు కూడా ఉన్నయన్న వివాదం తెరపైకి వచ్చింది! దీంతో... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు.

ఈ సందర్భంగా.. ఈ సరస్వతీ పవర్ కు సంబంధించిన భూములపై లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో.. అధికార యంత్రాంగం మరోసారి సర్వే చేయగా.. ఆ భూముల్లో అటవీ భూములు లేవు కానీ అసైన్డ్ భూములు మాత్రం ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా... వేమవరం, పిన్నెల్లిలో 24.84 ఎకరాలు గుర్తించారు.

దీంతో... ఈ భూముల రిజిస్ట్రేషన్స్ రద్దు కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. పల్నాడు జిల్లా కలెక్టర్.. ఆ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్స్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ అదేశాల మేరకు పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ ఆ అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ ను రద్దు చేశారు!

Tags:    

Similar News