హీటెక్కనున్న పాలిటిక్స్ : ముందే జగన్...బాబు అపుడే !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయనకు పదిహేను రోజుల పాటు విదేశాలలో పర్యటించేందుకు సీబీఐ కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2024-05-21 03:50 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయనకు పదిహేను రోజుల పాటు విదేశాలలో పర్యటించేందుకు సీబీఐ కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా ఈ నెల 17న రాత్రి ఏపీ నుంచి బయల్దేరి ఆయన తొలుత లండన్ చేరుకున్నారు. ఆ తరువాత స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ వంటి దేశాలలో ఆయన పర్యటించి జూన్ ఫస్ట్ కి ఏపీ చేరుకుంటారు అని వైసీపీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

ఈ విధంగానే జగన్ విదేశీ టూర్ షెడ్యూల్ చేయబడింది. అయితే ఇందులో మార్పు జరిగిందని దాంతో షెడ్యూల్ కి ముందే జగన్ ఏపీకి రానున్నారు అని మరో ప్రచారం మొదలైంది. ఆ విధంగా చూస్తే ఈ నెల 28 నాటికే జగన్ ఏపీలో ఉంటారు అని అంటున్నారు అంటే మూడు నాలుగు రోజుల పర్యటన కుదించుకుంటున్నారు అన్న మాట.

మరి ఈ వార్తలలో ఎంతవరకూ నిజం ఉంది అన్నది తెలియదు కానీ జగన్ ముందే ఎందుకు వస్తున్నారు అన్న దాని మీద అయితే రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో రాజకీయం పలు మలుపులు తిరుగుతోంది. పోస్ట్ పోల్ సర్వేలు అన్నీ వైసీపీకి జై కొడుతున్నా అనూహ్య పరిణామాలు జరిగితే అన్న చర్చ కూడా ఉందిట.

అదే విధంగా చూస్తే టైట్ ఫైట్ నడుస్తోందని ఎవరికి మ్యాజిక్ ఫిగర్ కి ఒకటి రెండు కంటే ఎక్కువ సీట్లు రావు అన్న ప్రచారమూ ఉంది. మరి ఈ నేపధ్యం అంతా చూసుకునే కాస్తా ముందుగా జగన్ ఏపీకి చేరుకుంటున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ టైట్ ఫైట్ నడిస్తే మాత్రం ఏపీలో క్యాంప్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి.

దాంతో అటూ ఇటూ అంతా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. దాంతోనే వైసీపీ కూడా ఎందుకైనా మంచిదని ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టి అలెర్ట్ అవుతోంది అని అంటున్నారు. రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, కర్నాటకాలు సహా అన్ని తరహా రాజకీయాలను పూర్తిగా చూసిన దేశమిది. దాంతో ఎవరికి వారు సర్దుకుంటున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని చంద్రబాబు కూడా ఈ నెల 27 నాటికి ఏపీకి వస్తారు అని అంటున్నారు. అంటే సీఎం జగన్ విపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఏపీకి దాదాపుగా ఒకే సమయంలో చేరుకుంటారు అని అంటున్నారు.

దాంతో ఏపీ రాజకీయం ఫుల్ హీటెక్కనుంది అని అంటున్నారు. అప్పటికి కౌంటింగ్ కి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి ఎన్నికలూ అలాగే జరిగాయి. అధినేతల వ్యూహాలూ అలాగే ఉన్నాయని అంటున్నారు. మరి జగన్ విదేశీ టూర్ నిజంగా రీ షెడ్యూల్ అయిందా ఆయన ముందుగానే ఏపీకి వస్తున్నారా ఈ ప్రచారంలో నిజం ఉంటే మాత్రం ఏపీ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్టులు చాలానే ఉండబోతున్నాయన్నది నమ్మాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News