ఎన్నికలపై జగన్ సంచలన ప్రకటన... చెప్పాడంటే చేస్తాడంటే

ఇప్పటికే గడపగడపకూ మన ప్రభుత్వ, జగనన్న సురక్ష పేరుతో జనాల్లోకి మరింతగా వెళ్లిన జగన్ ఈ నేపథ్యంలో మరో కీలక కార్యక్రమం నిర్వహించారు

Update: 2023-10-09 08:01 GMT

ఎన్నికలు సమీపిస్తున్న ఏపీ అధికార వైసీపీ చాపకింద నీరులా తమతమ ఎన్నికల పనులు చక చకా చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం పనులు ప్రభుత్వం చేస్తుంటే... పార్టీ పనులు పార్టీ చేసుకుంటూపోవాలన్నట్లుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యలో తాజాగా వైసీపీ అధినేత జగన్ పార్టీ విస్తృత స్థాయి సమా­వేశం ఏర్పాటు చేశారు.

అవును.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గడపగడపకూ మన ప్రభుత్వ, జగనన్న సురక్ష పేరుతో జనాల్లోకి మరింతగా వెళ్లిన జగన్ ఈ నేపథ్యంలో మరో కీలక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నాయకులకు, కార్యకర్తలకూ దిశానిర్ధేశం చేశారు.

ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు అంటూ గతకొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... కేడర్ కు జగన్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ముచ్చటే లేదని తేల్చి చెప్పారు.

ఇదే సమయంలో గడిచిన 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సంక్షేమ పాల అందించామని తెలిపిన జగన్... మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేశామని తెలిపారు. ఇదే సమయంలో మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా... 50శాతం పదవులను బీసీలకే ఇచ్చామని చెప్పిన జగన్... జగన్ మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు అని నిరూపించుకున్నామని కేడర్ కు స్పష్టం చేశారు. ఇదే సమయంలో... నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 10వరకూ "వై ఏపీ నీడ్స్‌ జగన్‌" కార్యక్రమాన్ని చేపడడామని కేడర్ కు సూచించారు.

అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 31వరకు మూడు ప్రాంతాల్లోనూ బస్సుయాత్రలు నిర్వహిస్తామని, ఆ బృదంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలే ఉంటారని తెలిపారు. ఈ బస్సుయాత్రలో భాగంగా... ప్రతి రోజూ మూడు మీటింగ్‌ లు జరుగుతాయని, వీటిలో ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయం, సాధికారత గురించి వివరించాలని అన్నారు. అందుకే ఇది కేవలం బస్సుయాత్రే కాదని, సామాజిక న్యాయయాత్ర అని జగన్ క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News