వైసీపీ బస్సు బయల్దేరుతోంది.. భారీ యాక్షన్ ప్లాన్ తో .!

ఇక ఈ నెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది అని జగన్ ప్రకటించారు.

Update: 2023-10-11 00:30 GMT

టీడీపీ బస్సు యాత్ర అన్నారు. చంద్రబాబు ఈపాటికి జైలులో ఉండకపోతే చేసి ఉండేవారు. ఇక ఆయన అరెస్ట్ నేపధ్యంలో అక్టోబర్ మొదటి వారంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారు అని ప్రచారం సాగింది. కానీ ఇపుడు చూస్తే ఆ కార్యక్రమం వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తే యాత్రలు అన్నీ ఆయనే చేస్తారు అన్నది పార్టీ పెద్దల ఆలోచనగా ఉంది. బాబు బయటకు వచ్చేది ఎపుడు అంటే కోర్టుల వైపు చూడాల్సిందే. దాంతో విచారణలు వాయిదాల మధ్యన టీడీపీ నేతలు ఆలోచనలో పడుతున్నారు.

ఇంకో వైపు చూస్తే వైసీపీ ఒక్క సారిగా స్పీడ్ పెంచి గేర్ మార్చేసింది. జగన్ ఈ నెల 9న విజయవాడలో పార్టీ ప్రతినిధులతో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తరువాత మరింత జోరు పెంచారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ మరో మీటింగ్ నిర్వహించారు. ప్రతినిధుల సభలో చెప్పిన విషయాలు అన్నీ కూడా సవ్యంగా గ్రౌండ్ లెవెల్ లో సాగేలా చూడాలని జగన్ ఆదేశించారు

ఇక ఈ నెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది అని జగన్ ప్రకటించారు. ఈ బస్సు యాత్రకు సామాజిక బస్సు యాత్ర అని పేరు పెట్టారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక మీటింగ్ కచ్చితంగా ఉండేలా ఈ బస్సు యాత్ర సాగుతుంది. అలాగే మూడు ప్రాంతాలను కవర్ చేస్తూ రోజూ మూడు మీటింగ్స్ తక్కువ కాకుండా రెండు నెలలలో ఈ బస్సు యాత్ర పూర్తి చేయాలని జగన్ కచ్చితమైన ఆదేశాలు ఇచ్చేశారు.

ఈ బస్సు యాత్ర సరిగ్గా సాగేలా చూడాల్సిన బాధ్యతను రీజనల్ కోర్ ఆర్డినేటర్లతో పాటు ప్రాంతాల వారీగా సీనియర్ నేతలను బాధ్యులుగా నియమించారు. ఇక బస్సు యాత్ర ప్రతీ నియోజకవర్గంలో ఉంటే ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యే లేదా ఇంచార్జితో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బీసీ విఘాలలకు చెందిన నాయకులు అంతా వేదిక మీదకు వచ్చి ప్రసంగించాలని జగన్ సూచించారు

వైసీపీ ప్రభుత్వం గడచిన 52 నెలలలో ఏమి చేసింది అన్నది ప్రజలకు సవివరంగా తెలియచేయాలని ప్రజలు అంతా ఈ సామాజిక న్యాయ బస్సు యాత్రతో కనెక్ట్ కావాలని జగన్ సూచించారు. ఏపీలో ఉన్న ప్రతీ పేదవాడూ వైసీపీని తమ సొంత పార్టీగా చూడాలని ఆ విధంగా వారు ఓన్ చేసుకునేలా పార్టీ మొత్తం వారి వద్దకు చేరి అంతా వివరించాలని జగన్ స్పష్టం చేశారు.

మొత్తం మీద చూస్తే వచ్చే ఎన్నికలకు జగన్ భారీ యాక్షన్ ప్లాన్ తో దిగిపోతున్నారు అని తెలుస్తోంది. దసరా ఈ నెల 23న వస్తోంది. ఆ తరువాత మూడు రోజులకు వైసీపీ బస్సు బయల్దేరుతుంది అని అంటున్నారు. ఇది రెండు నెలల పాటు ఈ ఏడాది చివరి దాకా కొనసాగుతుంది అని అంటున్నారు. రోజుకు మూడు మీటింగ్స్ అంటే మొత్తం 175 నియోజకవర్గాలు పూర్తి అవుతాయని అంటున్నారు.

Tags:    

Similar News