జగన్ కు ఇప్పుడే బెయిల్‌ రద్దు చేయాలా?... సుప్రీం సూటి ప్రశ్న!

ఒకవైపు స్కిల్ డెవపల్ మెంట్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్, ఇసుక, మధ్యం ఇలా పలురకాల కేసులు చంద్రబాబును వెంటాడుతున్న సంగతి తెలిసిందే.

Update: 2023-11-24 09:44 GMT

ఒకవైపు స్కిల్ డెవపల్ మెంట్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్, ఇసుక, మధ్యం ఇలా పలురకాల కేసులు చంద్రబాబును వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ బెయిల్ రద్దుపై దృష్టి కేంద్రీకరించారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇందులో భాగంగా సుప్రీంలో ఆయన వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం ఆసక్తికరంగా స్పందించింది.

అవును... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ పిటిషన్‌ పై విచారణ జరిగింది. ఇందులోభాగంగా... జగన్‌, సీబీఐ సహా ప్రతివాదులందరికీ జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.

గత పదేళ్లుగా జగన్‌ బెయిల్‌ పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని.. వెంటనే బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ సాక్ష్యాలు చెరిపేస్తున్నారు అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా..? అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.

ఈ సమయంలో జగన్‌ కు బెయిల్‌ మంజూరు చేసిన తర్వాత.. దర్యాప్తు సంస్థలు హైకోర్టులో సవాలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఇప్పుడే బెయిల్‌ రద్దు చేయాలా? అని ధర్మాసనం మరో ప్రశ్నవేసిందని తెలుస్తుంది. దీంతో... నోటీసులు ఇచ్చిన అనంతరం తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టును కోరారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌, సీబీఐ స‌హా ప్రతివాదులంద‌రికీ నోటీసులు ఇవ్వాల‌ని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం... తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి కోర్టు వాయిదా వేసింది!

Tags:    

Similar News