పెళ్ళాలు కాదు భార్యలు...ఓకేనా...!?

అయితే ఈసారి చిన్న కరెక్షన్ ఉంది. పెళ్ళాలు అనే బదులు భార్యలు అన్న మాట వాడారు. పెళ్లాలు అంటే పవన్ గుచ్చుకుంటున్నారు అని కాబోలు భార్యలు అని జగన్ విమర్శలు చేశారు.

Update: 2024-03-07 15:49 GMT

అదే విమర్శ, అదే ర్యాగింగ్, అదే పంచ్ అదే సెటైర్ ఒక్క మాట మాత్రం మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ మాట అంటే మండిపోతారో అదే మాటను పనిగట్టుకుని పదే పదే వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. ఇది ఒకసారి కాదు అనేక సార్లు. అదే పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం. ఇటీవల తాడేపల్లిగూడెం సభలో పవన్ ఆవేశంతో ఊగిపోవడం వెనక ఈ విమర్శ ఉంది అన్నది తెలిసిందే.

నాకు మూడు పెళ్ళిళ్ళు అయితే నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నారు జగన్ నాలుగవ పెళ్ళాం అని కూడా అంటున్నారు చీప్ గా అని పవన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆ తరువాత జగన్ కొన్ని బహిరంగ సభలలో పాల్గొన్నారు కానీ పవన్ విమర్శలకు తిప్పికొట్టలేదు నా నాలుగవ పెళ్లాం నీవేన జగన్ అంటూ రెచ్చగొట్టినా కౌంటర్ ఇవ్వలేదు.

దాంతో జగన్ పవన్ పెళ్ళిళ్ల మీద ఇక మాట్లాడరు వదిలేశారు అని అంతా అనుకున్నారు. కానీ అనకాపల్లి సభలో మాత్రం జగన్ మళ్ళీ అదే ప్రస్తావన తెచ్చారు. అవే విమర్శలు చేశారు. అయితే ఈసారి చిన్న కరెక్షన్ ఉంది. పెళ్ళాలు అనే బదులు భార్యలు అన్న మాట వాడారు. పెళ్లాలు అంటే పవన్ గుచ్చుకుంటున్నారు అని కాబోలు భార్యలు అని జగన్ విమర్శలు చేశారు.

ఇక పెళ్ళాం అయినా భార్య అయినా అర్థం ఒక్కటే. కానీ విషయం మాత్రం ఒక్కటే. అదే పవన్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని, ఆయనకు విలువలు లేవని వివాహ వ్యవస్థకు పవన్ కళంకం తెచ్చారని అనకాపల్లి సభలో జగన్ గట్టిగానే కామెంట్స్ చేశారు. అంటే పవన్ మీద జగన్ విమర్శలు ఆగవా అంటే దీన్ని బట్టి అర్ధం అవుతోంది అదే అంటున్నారు.

మరో వైపు చూస్తే పెళ్ళాం అంటే నీచంగా విమర్శలు చేశారని పవన్ అంటున్నారు అని భార్యలు అని జగన్ పదం మార్చారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇది ఓకేనా అని కూడా సెటైర్లు వేస్తున్నారు. అయితే పెళ్లాం అన్న మాట తప్పు ఏమీ కాదు, పెళ్ళాం పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం దాకా సాహిత్యంలో కూడా పెళ్ళాం అన్న పదం ఉంది. దానికి పవిత్రత కూడా ఉంది.

అయినా సరే పెళ్లాం అంటున్నారు జగన్ అని పవన్ మండిపడుతున్నారు. బహుశా ఆయన ఉద్దేశ్యం పెళ్ళాం అన్న మాట కంటే తన మూడు పెళ్ళిళ్ళ గురించి జగన్ చేస్తున్న విమర్శలే అని అంటున్నారు. అయితే జగన్ మాత్రం అదే కెలుకుతున్నారు. పవన్ ఏ మాటలు అంటే ఎక్కువ ఇబ్బంది పడతారో ప్రత్యర్ధి పక్షం గుర్తించి మరీ గురి పెడుతోంది.

ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడవచ్చు. రాజకీయాల్లో వ్యక్తిగతం ఎందుకు తెస్తారు అని. అయితే ప్రజా జీవితంలోకి వస్తే ఎవరిని అయినా నిలదీస్తాం ప్రశ్నిస్తాం అని మహా కవి శ్రీశ్రీ ఎనాడో చెప్పారు. నీ జీవితం పబ్లిక్ కానంతవరకూ ఓకే. వన్స్ నీవు పబ్లిక్ లోకి వచ్చాక అందునా ప్రజా సేవ చేయాలని అనుకున్నపుడు ప్రత్యర్ధులు మంచి ఎందుకు చూస్తారు ఏ చిన్న చెడ్డ ఉన్నా కూడా దాన్నే బూతద్ధంలో పెట్టి వెతుకుతారు. కెలికి వదిలిపెడతారు.

దీని నుంచి పవన్ మాత్రమే కాదు జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరూ తప్పించుకోలేరు. ఇక జగన్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని విపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. చంద్రబాబుని వెన్నుపోటుతో పాటు అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూంటాయి. పవన్ విషయం తీసుకుంటే ఆయన చట్ట సభలకు నెగ్గలేదు. అయినా ఆయన వ్యక్తిగత జీవితం తీసుకుని విమర్శలు చేస్తూంటాయి. ఇది తప్పు కదా అంటే రాజకీయాల్లో ఇపుడు అంతా ఇంతే. ఎవరేమి చెప్పినా ప్రత్యర్ధులను విమర్శించడం మానరు. ఇక పబ్లిక్ లైఫ్ లో వ్యక్తిగతం అన్నది ఉండదు, సో దీనికి పవన్ ధీటైన కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఏమి చెబుతారో చూడాల్సిందే.

Tags:    

Similar News