లండన్ పర్యటకు వెళ్లిన జగన్... ఎయిర్ పోర్ట్ లో ఆసక్తికర సన్నివేశం!
అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా... శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ నుంచి బయలుదేరారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఈ గ్యాప్ లో ఉన్న సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో గడిపేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడకు నుంచి బయలుదేరారు. ఆయన అక్కడ తన కుటుంబ సభ్యులతో గడిపి.. తిరిగి ఎన్నికల ఫలితాలకు మూడు రోజుల ముందు జూన్ 1న ఏపీకి తిరిగిరానున్నారు.
అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా... శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ నుంచి బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా జగన్.. ముందుగా లండన్ వెళుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మరికొన్ని దేశాల్లో పర్యటించనున్నారని అంటున్నారు!
ఇక, సీఎం విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్ లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్టు, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిలు సెండాఫ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారందరితోనూ జగన్ వారందరితో ఉత్సాహంగా కనిపించారు.
కాగా.. పోలింగ్ తేదీకి, ఫలితాలకూ మధ్య సుమారు మూడు వారాలకు పైగా సమయం ఉండటంతో విదేశీ పర్యటన ప్లాన్ చేశారు జగన్. ఈ నేపథ్యంలో... అందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లండన్ వెళ్లేందుకు బెయిల్ సమయంలో ఉన్న షరతుల్ని సడలించాలని కోరారు.
ఈ సమయంలో... విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి సూచించగా.. జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అయితే కోర్టు మాత్రం విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ కు అనుమతి ఇచ్చింది. దీంతో శుక్రవారం రాత్రి జగన్ బయలుదేరి వెళ్లారు.