జగన్ మార్క్ పంచ్ : ఏ ఒక్కడూ నీకు ఓటేయడూ బాబూ...!
ప్రతీ పేదకూ వివక్ష లేకుండా అవినీతి లేని విధంగా సుపరిపాలన తీసుకుని వచ్చింది వైసీపీ ప్రభుత్వం అన్నారు.
అయిదేళ్ల పాటు పాలించి ఏ ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబుకు ఎవరైనా మళ్లీ ఓటేస్తారా అని విశాఖ జిల్లా భీమిలీలో జరిగిన సభలో జగన్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చిన వైసీపీని ఎవరైనా ఓటు వేయకుండా వదులుకోగలరా అని ఆయన ప్రశ్నించారు. లంచాలు లేకుండా నేరుగా నగదు బదిలీ చేశామని అన్నారు. ప్రతీ పేదకూ వివక్ష లేకుండా అవినీతి లేని విధంగా సుపరిపాలన తీసుకుని వచ్చింది వైసీపీ ప్రభుత్వం అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిందని అన్నారు. పేదలకు న్యాయం చేసినని అన్నారు. ప్రతీ పేద కుటుంబాలను వెళ్ళి అడగండి, గత పదేళ్లలో వారి బ్యాంక్ ఖాతాలలో ఉన్న డబ్బుని చూడమని అడగండి అని క్యాడర్ కి సూచించారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఏ ఒక్క రూపాయి అయినా వేసిందా అని వారినే అడగండి అని అన్నారు.
అదే జగన్ ప్రభుత్వంలో వారి బ్యాంక్ ఖాతాలలో ఎంత సొమ్ము వచ్చి చేరింది అని కూడా అడంగడి అని సూచించారు. ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం ఎవరిది అని కూడా అడగాలని ఆయన కోరారు. ఆ బ్యాంక్ ఖాతాలో చూడమని కూడా ఆయన చెప్పారు. కరోనా కష్టాలు వచ్చినా కూడా పేదలకు నేరుగా డబ్బు వేసిన ప్రభుత్వం మనది అన్నారు.
ఎన్ని కష్టాలు ఉన్నా సాకులు వెతుక్కోలేదని అన్నారు. ప్రజలకు కరోనా రెండేళ్ల కాలంలో అండగా నిలబడింది జగన్ మాత్రమే అని చెప్పండి అని ఆయన క్యాడర్ కి సూచించారు. వార్డు మెంబర్లు సర్పంచులు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధిలు నామినేటెడ్ పోస్టులలో ఉన్న వారు ప్రతీ కార్యకర్తకూ చెప్పే విషయం ఒక్కటే, ఇది మీ అందరి పార్టీ అని ఆయన అన్నారు.
ఇది నా పార్టీ కాదు మీ పార్టీ అని అన్నారు. మీ అందరి పార్టీ అని ఆయన అన్నారు. మీరే సారధులు వారధులు అని జగన్ చెప్పుకొచ్చారు. మీ అందరికీ ఒక మంచి సేవకుడు మాత్రమే జగన్ అని ఆయన అన్నారు. వైసీపీ అట్టడుగు కార్యకర్తది అని ఆయన అన్నారు. కార్యకర్తలనూ నాయకులను అభిమానించే విషయంలో దేశ చరిత్రలో ఏ పార్టీ అనుసరించని విధానం ఒక్క వైసీపీదే అని ఆయన అన్నారు.
అన్ని నామినేటెడ్ పదవులూ వైసీపీయే భర్తి చేసి బడుగులకు న్యాయం చేసింది అని ఆయన అన్నారు. బీసీలను బ్యాక్ బోన్ గా భావించామని అన్నారు. టీడీపీ క్యాడర్ ని ముందు పెట్టి జన్మ భూమి కమిటీలను నియమించి లంచాలు వివక్షతో పనిచేసిందని ఆయన విమర్శించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను సృష్టించి ప్రతీ ఇంటికీ పధకాన్ని అందచేస్తోందని అన్నారు.
ప్రభుత్వానికి ప్రతినిధిగా వాలంటీర్లు పనిచేస్తున్నారు అని జగన్ చెప్పుకొచ్చారు. ప్రతీ పేదకు మంచి చేసేది వాలంటీర్లు వ్యవస్థ అని అన్నారు. వాలంటీర్లు అంటే మన వారే అని ఆయన అన్నారు. వైసీపీ ప్రజల గుండెలలో ఉంది కాబట్టే మంచి మెజారిటీలు వస్తున్నాయని అన్నారు. చరిత్రలో ఎపుడూ ఎవరికీ ఇవ్వని అవకాశాలు వైసీపీ ఇచ్చిందని ఆయన అన్నారు. ఎవరూ చేయని విధంగా న్యాయం చేసింది వైసీపీ అని ఆయన అన్నారు.