175/175 పదమే జగన్ కొంప ముంచిదా ?

ఏమో ఈ విశ్లేషణ కూడా నిజం కావచ్చు. వై నాట్ 175 అన్న స్లోగన్ ఆత్మ విశ్వాసానికి ప్రతీక గా ఇచ్చుకున్నట్లుగా వైసీపీ చెప్పుకుంటే చెప్పుకోవచ్చు

Update: 2024-06-04 13:56 GMT

ఏమో ఈ విశ్లేషణ కూడా నిజం కావచ్చు. వై నాట్ 175 అన్న స్లోగన్ ఆత్మ విశ్వాసానికి ప్రతీక గా ఇచ్చుకున్నట్లుగా వైసీపీ చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ అది కాస్తా గత రెండేళ్ళుగా వైసీపీ నేతల మాటలలో నలిగి అహంకారానికి ప్రతిరూపంగా మారిపోయింది.

మొత్తం 175 సీట్లు మేమే కొడతామని వైసీపీ చెప్పడంలో నిబ్బరం కంటే గర్వమే కనిపించింది. జనాలు అలాగే చూసారు. 151 సీట్లు వస్తాయని వైసీపీ 2019 ఎన్నికల వేళ ఊహించలేదు. కానీ వచ్చాయి. మరి ఆ వినమ్రత ఈసారి కూడా ఉంచుకుని ఎన్నికలకు పోతే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ మొత్తానికి మొత్తం సీట్లు మా ఖాతాలోనే పడాలన్న దురాశతో కూడా రాజకీయమే వైసీపీ కొంప ముంచింది అని అంటున్నారు.

ప్రజాస్వామ్యంలో అసలైన ప్రభువులు అనదగిన ప్రజలకు ఇది అసలు బొత్తిగా నచ్చని వ్యవహారమే అయింది అని అంటున్నారు. ప్రజా స్వామ్యంలో ప్రజలే ప్రభువులు. వారే ఓటు వేయాలి. వారే గెలిపించాలి. వారే సీట్లు ఇవ్వాలి.

అంతే తప్ప ఏ నాయకుడు అయినా అహంకార పూరితంగా గెలుపు గురించి ఇలా గట్టిగా మాట్లాడితే ప్రజలు ఒప్పరు కాక ఒప్పరు. అది దేశంలో ఎంతటి పెద్ద పార్టీలకు అయినా అలాగే జరిగింది. బీజేపీ 400 సీట్లు అన్నా అలాగే రిజల్ట్ వస్తోంది. ఇక ఏపీలో అయితే వైసీపీ విషయంలో ప్రజలు కూడా అంతే తీరుగా రెస్పాండ్ అవుతున్నారు.

ప్రజలు కోరుకునేది వినమ్రతతో కూడిన అప్పీల్. అంతే తప్ప ఎవరికి వారుగా నంబర్లు డిక్లేర్ చేసుకుని వాటిని జనం ముందు పెట్టి రైట్ కొట్టమంటే ప్రజలు అసలు నచ్చుకోరు. ఇదే వైసీపీ విషయంలో జరిగింది అని అంటున్నారు.

జగన్ అయినా మరొకరు అయినా మమ్మల్ని గెలిపించండి అని కోరుకోవడం వేరు మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేయండం వేర వై నాట్ అంటూ అతి ధీమాగా ముందుకు పోవడం వేరు. ఈ తేడాను రాజకీయ పార్టీలు తెలుసుకుంటేనే విజయం వరిస్తుంది అని అంటున్నారు. సో వై నాట్ 175 స్లోగన్ వైసీపీకి అచ్చి రాలేదని కచ్చితంగా రుజువు అయింది.

Tags:    

Similar News