దత్తపుత్రుడికి బీపీ పెరిగిపోతోంది...జగన్ సెటైర్లు !
ఇంతకీ దత్తపుత్రుడికి బీపీ ఎందుకు అంటే ఆయన పవిత్రమైన వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించారని జగన్ విరుచుకుపడ్డారు.
దత్తపుత్రుడికి ఇటీవల కాలంలో బీపీ పెరిగిపోతోంది ఆయన పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు. ఆయన కాళ్ళూ చేతులు తల మొత్తం బాడీ అంతా ఊపేస్తున్నాడు. దత్తపుత్రుడి బీపీని తట్టుకోవడం కష్టం సుమా అని భీమవరం సభలో జగన్ సెటైర్లు వేశారు. ఇంతకీ దత్తపుత్రుడికి బీపీ ఎందుకు అంటే ఆయన పవిత్రమైన వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించారని జగన్ విరుచుకుపడ్డారు.
నాలుగేళ్ళకు అయిదేళ్లకు భార్యలను మారుస్తూ ఉంటాడు, కార్లను మార్చినట్లుగా భార్యలను మార్చడం దత్తపుత్రుడికి అలా చేయడం తప్పు కదయ్యా అని అడిగితే దత్తపుత్రుడిలో బీపీ తన్నుకు వస్తోందని జగన్ ఎద్దేవా చేశారు. పెళ్ళి చేసుకుని పిల్లలను కనేసి వదిలేయడం మంచిదేనా అని పవన్ ని సూటిగా జగన్ ప్రశ్నించారు. ఇదేమి పద్ధతి అని మండిపడ్డారు.
ఆ విధంగా అందరూ పవన్ మాదిరిగా చేస్తే అక్కచెల్లెమ్మల బతుకులు ఏమవుతాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం మీద తప్పు అని చెబితే కోపం తన్నుకుని బీపీ పెంచుకుంటున్నాడు దత్తపుత్రుడు అని జగన్ ఫైర్ అయ్యారు. ఒకసారి చేస్తే పొరపాటు అంటారని పదే పదే చేస్తే అలవాటు అంటారని అలా అలవాటుగా మార్చుకున్న దత్తపుత్రుడు తనను ఎవరూ ఏమీ అనకూడదు అంటే ఎలా అని నిలదీశారు.
ఆఖరుకు దత్తపుత్రుడు తన అలవాటుని ఎంతదాకా తీసుకుని వచ్చారు అంటే ఏకంగా ఇపుడు నియోజకవర్గాలను కూడా మాచేస్తున్నారు అని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో పవన్ భీమవరం గాజువాకలలో పోటీ చేస్తే ఈసారి భీమవరంలో పోటీ చేశారు. ఈసారి ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు.
దాంతో జగన్ పవన్ మీద కొత్త సెటైర్ వేశారు. ఈయన భార్యలను మారుస్తారు నియోజకవర్గాలు మారుస్తారు అని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడి తప్పులు చెబుతూంటే చంద్రబాబుకు కూడా కోపం వస్తోందని అలాగే ఆయన వదినమ్మకూ కోపం వస్తోంది ఏమిటో అర్ధం కావడం లేదని జగన్ అన్నారు.
పవన్ కళ్యాణ్ మీద మరోసారి పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చి అక్క చెల్లెమ్మల బతుకులు అంటూ జగన్ వేసిన సెటైర్లు చర్చనీయాంశం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వద్దు అంటున్నా మూడు పెళ్ళిళ్ల వ్యవహారం మాత్రం ప్రత్యర్ధులకు ఆయుధంగానే మారుతోంది. ప్రజా జీవితంలో ఇలాగే ఉంటుందని అంటారు. ప్రత్యర్ధులు ఏవైనా అంటారు ఎన్ని అయినా విమర్శలు చేస్తారు.
జవాబు చెప్పుకోవడం ఎవరికైనా కష్టమే కానీ రాజకీయాల్లో తప్పట్లేదు. ఒక్క మాట ప్రజలకు అన్ని విషయాలూ తెలుసు. వారికి ఎవరు ఏమి అన్నా ఎవరి తప్పులు ఎవరు ఎత్తి చూపినా ఇష్టం అయినపుడు ఎన్నుకుంటారు. అపుడు ఎవరూ ఏమీ చేసేది లేదు. మొత్తానికి జగన్ ని దోపిడీ దారుడు అని పవన్ అంటూంటే ఆయన మూడు పెళ్ళిళ్ల గురించి జగన్ కౌంటర్లేస్తున్నారు.
అవినీతి అంటే ఏదైనా అవినీతి అనే మేధావులు చెబుతున్నారు. సమాజంలో నాయకుల వ్యక్తిత్వాలు ఎపుడూ జనంలో స్వచ్చంగానే ఉండాలని అంటారు. లోపాలు ఉంటే చిన్నపాటి తప్పులు ఉంటే కూడా వాటిని బయటపెట్టి మరీ రచ్చకీడుస్తారు. ఏపీలో అయితే వ్యక్తిగత దాడులు అన్ని పార్టీలూ చేస్తునాయి. దాంతో ఎవరూ దీనికి అతీతం కాదు, ఎవరూ బాధితులు కాకుండా పోరు అన్నట్లుగానే సీన్ ఉంది.