లోకేష్ పవన్ లకు ఒకేసారి చెక్ పెడుతున్న జగన్...!?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక విషయంలో భారీ కసరత్తు చేస్తున్నారు. అందులోనూ టీడీపీ జనసేనలకు చెందిన ఇద్దరు కీలక నేతల విషయంలో పెద్ద ఎక్సర్ సైజే సాగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక విషయంలో భారీ కసరత్తు చేస్తున్నారు. అందులోనూ టీడీపీ జనసేనలకు చెందిన ఇద్దరు కీలక నేతల విషయంలో పెద్ద ఎక్సర్ సైజే సాగుతోంది. దాంతో ఒకేసారి అటు అమరావతి ఇటు విశాఖ వైసీపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించే పరిణామాలు చోటు చేసుకున్నారు.
శాసన రాజధాని అమరావతిలో అలాగే పరిపాలనా రాజధాని విశాఖలో వైసీపీ కీలక మార్పులే చేసింది. అమరావతి రాజధాని పరిధిలోనికి వచ్చే మంగళగిరిలో టీడీపీ యువ నేత నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. దాంతో ఆయన్ని మరోసారి ఓడించాలని వైసీపీ గట్టిగా డిసైడ్ అయింది. దాంతో మంగళగిరిలో వరసగా రెండు సార్లు గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి బదులుగా బీసీ నేత గంజి చిరంజీవికి టికెట్ కన్ ఫర్మ్ చేస్తోంది అని తెలుస్తొంది.
ఇక మంగళగిరి టికెట్ దక్కదన్న కారణంతో ఆర్కే రాజీనామా చేసి వెళ్లారు అని అంటున్నారు. ఆయన ప్లేస్ లో వెంటనే గంజి చిరంజీవిని ఇంచార్జిగా నియమించడం వెనక వైసీపీ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. మంగళగిరిలో పెద్ద సంఖ్యలో చేనేత కులస్తులు ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి 2014లో గెలుపు అంచులను తాకి ఓడిపోయారు. 2014లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ల మీద ఓడారు.
ఇక 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు. నారా లోకేష్ ని ఆళ్ళ ఓడించారు. 2024లో నారా లోకేష్ అదే సీటు నుంచి పోటీ పడుతున్నారు. దాంతో గంజి చిరంజీవిని ముందు పెట్టి గెలుపు సాధించాలని వైసీపీ భారీ వ్యూహచన చేస్తోంది. అలా లోకేష్ చెక్ పెట్టడమే కాదు అమరావతి రాజధానిలో వైసీపీ ఫ్యాన్ చక్రాలు గిర్రున తిరగాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది అని అంటున్నారు.
ఇక విశాఖలో చూసుకుంటే గాజువాక సీటు కూడా వైసీపీ ఇంపార్టెంట్ గా తీసుకుంటోంది. 2024 ఎన్నికల్లో పవన్ మరోసారి గాజువాక నుంచి పోటీ చేస్తారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన్ని ఎదుర్కోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫ్యామిలీ సరిపోదు అని సర్వేల ఆధారంగా నిర్ధారణకు వచ్చిన వైసీపీ వరికూటి రామచంద్రరావు కి టికెట్ ఇవ్వాలని చూస్తోంది.
అందుకే గాజువాక ఇంచార్జిగా ఆయన్ని నియమిస్తోందని అంటున్నారు. ఇలా ఒకే సారి అటు లోకేష్ కి ఇటు పవన్ కి చెక్ పెట్టడానికి జగన్ రెడీ అయ్యారని అంటున్నారు.
అంతే కాదు ఎలాంటి మొహమాటాలకు తావు లేకుండా అభ్యర్ధులను ఎంపిక చేయలని కూడా వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. గెలుపు గుర్రాలకే చాన్స్ అని అంటున్నారు. సర్వేల ఆధారంగా పనితీరుని బేరీజు వేసుకోవడమే కాకుండా సామాజిక రాజకీయ పరిణామాలను కూడా అంచనా వేసుకుంటూ వైసీపీ కీలక నిర్ణయాలను తీసుకుంటోంది అని అంటున్నారు.