శ్రావణమాసంలో జగన్ సంచలన నిర్ణయం ?
దాంతో రానున్న శ్రావణ మాసంలో సంచలన నిర్ణయాలు వైసీపీ నుంచి ఉంటాయని ప్రచారం సాగుతోంది
వైసీపీ అధినేత జగన్ ముహూర్తాలను చూసుకుంటూ అడుగులు వేస్తున్నారు. దాంతో రానున్న శ్రావణ మాసంలో సంచలన నిర్ణయాలు వైసీపీ నుంచి ఉంటాయని ప్రచారం సాగుతోంది. జూలై నెలలో నిర్వహించాలని అనుకున్న ప్రజా దర్బార్ కార్యక్రమం వాయిదా పడింది. జగన్ పులివెందుల బెంగళూరు పర్యటనలకు వెళ్ళిపోయారు.
అయితే ఆషాడ మాసం కావడంతోనే ప్రజాదర్బార్ ని జగన్ ప్రారంభించలేదని అంటున్నారు. ఆగస్టు 5 నుంచి శ్రావణమాసం మొదలవుతోంది. దాంతో జగన్ ప్రజా దర్బార్ ని ఆగస్టు నెల మొదటి వారంలో నిర్వహించడానికి మంచి ముహూర్తం నిర్ణయించారు అని అంటున్నారు.
ప్రజాదర్బార్ ని తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో నిర్వహిస్తారని అంటున్నారు. ప్రజల సమస్యలను నేరుగా వినడం వాటి పరిష్కారం కోసం అధికారులకు వినతులు పంపడం మరికొన్ని ముఖ్య సమస్యల మీద ప్రజా పోరాటాలు చేయడం ఈ కార్యక్రమం ద్వారా చేపట్టాలనుకున్నది అని అంటున్నారు.
అంతే కాదు ప్రజా దర్బార్ వల్ల ప్రజలతో మమేకం కావడం అన్నది అత్యంత కీలకంగా చెబుతున్నారు. ఆ విధంగా వారికి ఎంత దగ్గరైతే అంత ఎక్కువగా జనాదరణ లభిస్తుందని అంతే కాకుండా గ్రౌంద్ లెవెల్ రియాల్టీస్ తెలుస్తాయని అంటున్నారు. అదే విధంగా ప్రజలు అందించే ఫీడ్ బ్యాక్ కూడా పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గా ఉండి పార్టీ ఎదుగుదలకు కార్యాచరణకు దోహదపడుతుందని అంటున్నారు.
మరో వైపు చూస్తే పార్టీ నేతలకు క్యాడర్ కి కూడా జగన్ సమయం కేటాయిస్తారు అని అంటున్నారు. ముందస్తు అపాయింట్మెంట్లు అన్న కండిషన్లు లేకుండా ఇవి సాగుతాయని చెబుతున్నారు. ఎవరైనా నేరుగా కలిసే వెసులుబాటుని జగన్ కల్పిస్తున్నారు అని అంటున్నారు.
ఇలా పార్టీని కాపాడుకోవడం కోసం చర్యలు చేపడుతూనే ఆగస్టు 15 వరువాత జగన్ జిల్లా పర్యటనలకు కూడా రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలను ఒక కాల పరిమితి పెట్టుకుని చుట్టి రావాలని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు.
దాని వల్ల ఘోర పరాజయం తరువాత పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని అంటున్నారు. ఇక పార్టీలో ఉన్న వారు ఎవరు పోయేది ఎవరు అన్నది ఒక అంచనాకు తెచ్చుకుంటూ కొత్త కమిటీలను కూడా జిల్లా స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలోనూ ఏర్పాటు చేస్తారని అది కూడా శ్రావణ మాసంలోనే ఉండవచ్చు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే ఓటమి తరువాత వెంటనే తేరుకున్న వైసీపీ అధినేత జనంలోకి వెళ్ళడానికి కూడా ఇపుడు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఇక మీడియాకు ఎప్పటికపుడు టచ్ లో ఉంటూ పార్టీ వాయిస్ ని వినిపిస్తూ ప్రభుత్వాన్ని ఆ విధంగానూ ఎండగట్టేందుకు జగన్ యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేశారు అని అంటున్నారు. సో శ్రావణ మాసంలో వైసీపీలో అనేక సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయని అంటున్నారు.