జగన్ ధీమా అంత.. నేతల ధైర్యం ఇంత.. ఫైనల్ నెంబర్?

అయితే... ఈ నెంబర్ పైనే పార్టీలో వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది. ఈ సందర్భంగా పలువురు నేతలు ఈ నెంబర్ విషయంలో జగన్ తో ఏకీభవించడం లేదని అంటున్నారు.

Update: 2024-05-30 07:10 GMT

ఏపీలో జూన్ 4న వెలువడబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఆసక్తి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ప్రధానంగా వైసీపీ నేతలైతే నెంబర్ పై ఒకతాటిపైకి రాకపోయినా.. గెలుపుపై మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు ఫిక్స్ చేస్తున్నారు.

అవును... ఏపీలో ఎన్నికల ఫలితాలపై వైసీపీ పూర్తి ధీమా వ్యక్తం చేస్తుంది! ఈ సందర్భంగా జగన్ వేసిన లెక్కలపై ఆసక్తికరమైన విషయం తరపైకి వచ్చింది. పోలింగ్ అనంతరం రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి వివరాలను సేకరించారు వైఎస్ జగన్. ఎక్కడ ఏ వర్గం ఓట్లు వైసీపీకి ఎలా పోల్ అయ్యాయనే విషయంపై తీవ్ర కసరత్తు చేశారని అంటున్నారు.

ఇదే క్రమంలో విదేశీ పర్యటనకు ముందు ఐప్యాక్ టీం తోనూ సమావేశమయ్యారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా 2019 కంటే ఎక్కువ సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు. అంటే... 151 కంటే ఎక్కువన్నమాట. ఇదే క్రమంలో ఎంపీ సీట్లు 22 దాటుతాయని విశ్వాసం వ్యక్తం చేసారు.

అయితే... ఈ నెంబర్ పైనే పార్టీలో వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది. ఈ సందర్భంగా పలువురు నేతలు ఈ నెంబర్ విషయంలో జగన్ తో ఏకీభవించడం లేదని అంటున్నారు. అయితే... ఫలితాల విషయంలో 150 ప్లస్ అంటూ ధీమాగా ఉన్న జగన్... ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ పలువురు కీలక నేతలతో మాట్లాడినట్లు చెబుతున్నారు.

తాజాగా విదేశీ పర్యటనలో ఉన్న జగన్ పార్టీ ముఖ్యలతో మాట్లాడారని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. తాను చెప్పిన నెంబర్ రాబోతోందని మరోసారి స్పష్టం చేసారని అంటున్నారు. జూన్ 1న వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ జూన్ 4న వచ్చే ఎగ్జాట్ పోల్స్ మాత్రం తమవైపే అనుకూలంగా ఉంటాయని ధీమాగా చెబుతున్నారని తెలుస్తుంది. మహిళలు, వృద్ధులు పూర్తిగా తమవైపే ఉన్నారని జగన్ నమ్ముతున్నారంట!

జగన్ ధీమా ఇలా 150పైనే ఉంటే... జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు నేతలు మాత్రం తాము ఖచ్చితంగా 110 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఇలా జగన్ చెప్పినట్లుగా 150ప్లస్ అని చెప్పడానికి వైసీపీ నేతలు సాహసించటం లేదని అంటున్నారు. మరి జగన్ అంచనా గెలుస్తుందా.. లేక, నేతల ధీమా నిలుస్తుందా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News