బొత్స విషయంలో జగన్ డెసిషన్ బూమరాంగ్ ?

పేరులోనే స్థానిక ఎన్నికలు అని ఉంటే పక్క జిల్లా విజయనగరం నుంచి బొత్సను తెచ్చి విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించడమేంటని వైసీపీ నేతలు ఒక్క లెక్కన మండిపోతున్నారు అని ప్రచారం సాగుతొంది.

Update: 2024-08-03 12:30 GMT

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ది ఎంపిక విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పొరపాటు చేసారా అంటే విశాఖ జిల్లా వైసీపీ నేతలు అయితే అసహనంతో రగిలిపోతున్నారు అని అంటున్నారు. పేరులోనే స్థానిక ఎన్నికలు అని ఉంటే పక్క జిల్లా విజయనగరం నుంచి బొత్సను తెచ్చి విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించడమేంటని వైసీపీ నేతలు ఒక్క లెక్కన మండిపోతున్నారు అని ప్రచారం సాగుతొంది.

అసలే టీడీపీ కూటమి అధికారంలో ఉంది. పైపెచ్చు బలంగా ఉంది. ఈసారి ఎలాగైనా విశాఖ ఎమ్మెల్సీ పదవిని పొందాలని చూస్తోంది. అటువంటి వాతావరణంలో వైసీపీ అభ్యర్థి ఎంపికలో ఆచి తూచి వ్యవహరించాలి కదా అన్న మాట వినిపిస్తోంది. విశాఖ జిల్లాలో వైసీపీ నేతలు లేనట్లుగా బొత్సను దిగుమతి చేయడమేంటి అని కూడా ఫైర్ అవుతున్నారు.

ఇప్పటికే విశాఖ ఎంపీ అభ్యర్ధిగా బొత్స సతీమణి బొత్స ఝాన్సీని దించి వైసీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఆనాడు కూటమి ప్రభంజనం ఉన్నా కూడా నాన్ లోకల్ అని విశాఖ వారికి అవకాశం ఇవ్వలేదని ఆనాడు చాలా మంది వైసీపీ నేతలు మనస్పూర్తిగా పనిచేయలేదని విమర్శలు వినిపించాయి.

ఇపుడు చూస్తే ఆ తప్పుని సరిదిద్దుకోకుండా మరోమారు బొత్సను విశాఖ వైసీపీ మీద రుద్దుతున్నారని అంటున్నారు. నిజానికి ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ సీతు మీద చాలా మంది వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు అని అంటున్నారు. వారిలో మొదటి వారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్, ఆయన తనకు ఈ పదవి కావాలని చాలా ప్రయత్నం చేశారు అని అంటున్నారు.

ఆయన తరువాత చూస్తే మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఉన్నారు. ఆయన సీనియర్, సౌమ్యుడు, మంచి వారు. పక్కా లోకల్. ఆయనకు టికెట్ ఇస్తే విశాఖ రూరల్ జిల్లాను అంతా కలుపుకుని ముందుకు పోయేవారు అని అంటున్నారు. అలాగే 2024లో విశాఖ సౌత్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ప్రస్తుత విశాఖ వైసీపీ అధ్యక్షుడు కోలా గురువులు అయితే ఈ సీటు మీద పూర్తిగా ఆశలు పెంచుకున్నారని అంటున్నారు.

ఇలా విశాఖలో కీలక నేతలు ఎంతో మంది ఎమ్మెల్సీ విషయంలో పోటీ పడుతూంటే జగన్ మాత్రం తాడేపల్లి లో నిర్వహించిన సమావేశంలో అందరి అభిప్రాయం అని అడిగినా చివరికి బొత్సను ఎంపిక చేయడం మాత్రం ఎవరికీ నచ్చడం లేదు అని అంటున్నారు. జగన్ ఎవరిని ఎంపిక చేసినా విశాఖకు చెందిన వారికి అయితే అందరికీ ఒకేగా ఉండేదని అలా కాకుండా బొత్సని ముందుకు తేవడం ఏంటని అంటున్నారు.

మరో వైపు చూస్తే విశాఖలో సరైన నాయకులు లేరా అన్న చర్చ కూడా పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో చూస్తే జిల్లాలు దాటించి చాలా మంది నేతలను అటు నుంచి ఇటూ మార్చారు. చివరికి ఆ ప్రయోగం కాస్తా పూర్తి స్థాయిలో బెడిసికొట్టింది.

అయినా సరే వైసీపీ అధినాయకత్వం తమ తీరుని మార్చుకోకుండా మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే విధంగా వ్యవహరించడం ఏ మేరకు సబబు అని అంటున్నారు. బొత్స కుటుంబం మీద జగన్ కి అంత అభిమానం ఉంటే వారికి విజయనగరం జిల్లాలో ఎన్నో అవకాశాలు ఇవ్వవచ్చు కదా అని అంటున్నారు.

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధి కోటాలో స్థానికేతరులను దింపడం తోనే వైసీపీ రాజకీయ వ్యూహం దారి తప్పిందని అర్ధం అవుతోందని అంటున్నారు. వైసీపీ నేతలు పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న పరిస్థితుల్లో వారిని కాదని ఇలా చేయడమేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు.

విశాఖలో అసలే రాజకీయంగా వైసీపీ పరిస్థితి ఏ విధంగానూ బాగులేదని గుర్తు చేస్తున్నారు. అలాంటి చోట ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం సబబేనా అన్న చర్చ సాగుతోంది. వైసీపీలో నివురు గప్పిన నిప్పులా రాజుకుంటున్న అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు కూటమి కచ్చితంగా ప్రయత్నం చేస్తుంది అని అంటున్నారు ఇది ఒక విధంగా వైసీపీకి విశాఖ రాజకీయ జాతకం చెప్పే ఎన్నిక అని అంటున్నారు. . చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News