మేము పాండవులం...యుద్ధానికి సిద్ధం...!

కురుక్షేత యుద్ధానికి మేము సిద్ధం. మేమంతా పాండవులం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

Update: 2024-01-27 12:00 GMT

కురుక్షేత యుద్ధానికి మేము సిద్ధం. మేమంతా పాండవులం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని విశాఖ జిల్లా భీమిలీలో శనివారం ప్రారంభించారు. మార్పు అన్నది మన విధానం, పరిపాలనా పరమైన సంస్కరణలు మన నినాదం అని జగన్ అన్నారు.

పెత్తందార్ల పాలనను ఇప్పటిదాకా తెలుగుదేశం చేసింది అని అన్నారు. మూడు సార్లు సీఎం చేశారు. డెబ్బై అయిదేళ్ల వయసు వచ్చింది కానీ ఆయన చేసినది ఏమీ లేదు బాబుకు మంచి ఆలోచనలు ఎపుడూ రాలేదు అని జగన్ అన్నారు. ఆయన పేదలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యం లేదు, పల్లెలను బాగుచేయాలన్నది అసలు లేదని జగన్ దుయ్యబెట్టారు.

ఎన్నికల హామీలు అన్నీ కూడా అధికారంలోకి వచ్చాక మరచిన వారు చంద్రబాబు అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు అటు వైపు ఉన్నారు. కానీ రైతు భరోసా అంటే గుర్తుకు వచ్చేది జగన్ అని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు పగటి పూట ఉచిత విద్యుత్ అని రైతులకు సున్నా వడ్డీ అయినా అన్నీ అందుతున్నాయంటే గుర్తుకు వచ్చేది జగన్ అని అన్నారు.

అక్వా రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ అయినా గుర్తుకు వచ్చేది జగన్ అని ఆయన అన్నారు. ఏ పొలంలోకి వెళ్లినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముందని జగన్ నిలదీశారు. బాబు మార్క్ ఎక్కడైనాలేదు అని ఆయన అన్నారు. వైఎస్సార్ ప్రభుత్వం జగన్ మార్క్ ఎక్కడ చూసినా జగన్ కనిపిస్తున్నారు అని అన్నారు.

ఇక 104, 108 వంటివి చూసినా ఆరోగ్యశ్రీ 3250 ప్రొసీజర్లకు విస్తరించిన తీరు కూడా జగన్ మార్క్ అని అన్నారు. పదిహేడు కొత్త మెడికల్ కాలేజులు ఏర్పాటు చేశాం, ఏకంగా 53 వేల నియామకాలు కూడా వైద్య రంగంలో చేశామని అన్నారు. ఇలా ఏది తీసుకున్నా కనిపించేది ఒక వైఎస్సార్ ఒక వైఎస్సార్ కాంగ్రెస్ ఒక జగన్ మార్క్ అని ఆయన అన్నారు.

చంద్రబాబు పద్నాగేళ్ళు సీఎం గా ఉన్నా ఎక్కడా ఆయన పాలన మార్క్ లేనే లేదని అన్నారు. వైఎస్సార్సీపీ జగన్ మార్కే అని పదే పదే చెప్పారు. విద్యారంగాన్ని చూస్తే ఏ ప్రభుత్వ బడులు తీసుకున్నా జగన్ మార్క్ ఉందని అన్నారు. నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్సీ నుంచి ఐబీ దాకా ప్రయాణం. బై జూస్ కంటెంట్ వంటివి ప్రభుత్వ బడుల చేతులలో ఉంది. అలాగే ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలలో ట్యాబులు ఉన్నాయంటే జగన్ మార్క్ కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు.

ఫుల్ ఫీజ్ రీ ఎంబర్సమెంటు ఇస్తూ జగాన్న విద్యా దీవెన, వసతి దీవెన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. విదేశాలల్లో టాప్ యూనివర్శిటీలో కోర్సుల అనుసంధానం, జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు అన్నీ కూడా జగన్ మార్క్ ఇవన్నీ అని చెప్పుకొచ్చారు. ఎక్కడ చూసినా మమే అని ఆయన నిబ్బరంగా చెప్పారు.

మా మార్క్ ప్రతీ పల్లెలో ఉంది. ప్రతీ పధకంలో ఉంది. ప్రతీ రంగంలో ఉంది. ఇక సమాజిక న్యాయం విషయంలో కూడా మనదే మార్క్ అని అన్నారు. ప్రతీ సామాజిక వర్గం మీద ప్రేమ ఉంది కాబట్టే సగం పదవులు అన్నీ కూడా ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు ఇచ్చమని అన్నారు. మంత్రి వర్గంలో 68 శాతం పదవులు ఇచ్చామని స్పీకర్ గా బీసీ, కౌన్సిల్ చైర్మన్ గా ఎస్సీకి అవకాశం ఇచ్చామని చెప్పారు. అలాగే డిప్యూటీ చైర్మన్ పదవి మైనారిటీ మహిళకు ఇచ్చామని అన్నారు.

నా ఎస్సీ ఎస్టీ నా బీసీ నా మైనార్టీ వర్గాలు అని ప్రేమగా పిలుచుకుంటున్నామని జగన్ అన్నారు. రెండు లక్షల 13 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని జగన్ అన్నారు. స్వతంత్రం వచ్చిన తరువాత నుంచి కేవలం నాలుగు లక్షల ఉద్యోగాలే ఉన్నాయి అని గుర్తు చేశారు. రెండు లక్షల ఉద్యోగాల్లో ఎనభై శాతం బీసీలు ఎస్సీలు, మైనారిటీలకు ఉద్యోగాలు ఇచ్చమని అన్నారు.

నేరుగా నగదు బదిలీ పధకం రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలకు వారి ఖాతాలలోకి వెళ్లడం జరిగింది అన్నారు. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష అంతకంటే లేదు, డెబ్బై అయిదు శాతం పైగా బీసీలు ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీల ఖాతాలోకి వెళ్లారని అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి న్యాయం చేస్తున్నామని అన్నారు.




 



Tags:    

Similar News