జగన్ గుమ్మం దిగరా...స్ట్రాటజీ అదేనా...?

ఆయన అలా పార్టీని తన పొత్తిళ్ళ నుంచి పొదివి పట్టుకుని కాపాడుకుంటూ వస్తున్నారు. అసలి విడిచిపెట్టకుండా చూసుకుంటూ వస్తున్నారు.

Update: 2023-10-27 02:45 GMT

ఏపీలో అధికార వైసీపీ వ్యూహాలు వేరేగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ రాజకీయానికి పూర్తి విరుద్ధంగా వైసీపీ పాలిటిక్స్ సాగుతోంది. టీడీపీలో చంద్రబాబు అన్నీ తానే అయి వ్యవహరిస్తారు. అంతా నేనే అంటారు. ఏ చిన్న ప్రోగ్రాం చేయాలన్నా బాబు మొదట తయారుగా ఉంటారు.

ఆయన అలా పార్టీని తన పొత్తిళ్ళ నుంచి పొదివి పట్టుకుని కాపాడుకుంటూ వస్తున్నారు. అసలి విడిచిపెట్టకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఇది ఒక విధంగా పార్టీకి సుఖం నేర్పిందా అంటే కష్టకాలంలో డీలా పడిన టీడీపీని చూస్తే అదే నిజం అనిపిస్తుంది. చంద్రబాబు ఇపుడు జైలు గోడల మధ్యన ఉన్నారు. పార్టీలో ఎంతో మంది సీనియర్లు మాజీ మంత్రులు కీలక నేతలు ఉనా ఎవరూ గడప దిగని పరిస్థితి ఉంది.

అదే వైసీపీలో అధినాయకుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఉన్నారు. అయినా సరే ఆయన కూడా గుమ్మం దిగడంలేదు. కాలు కదపడంలేదు. పార్టీ నేతలనే జనంలోకి పంపుతున్నారు. మంత్రులను ఎమ్మెల్యేలను ఇతర నాయకులను ప్రజల వద్దకు వెళ్ళమని అంటున్నారు ఇది ఇవాళ కొత్తగా చేస్తున్న ప్రాక్టీస్ కాదు, గడచిన ఏణ్ణర్థం కాలంగా జగన్ ఇదే చేస్తున్నారు.

తాను వెనక ఉంటూ ముందు పార్టీ నేతలను ఉంచుతున్నారు. తన బొమ్మను పెట్టి వారిని ఓట్లు కోరమంటున్నారు. ఒక విధంగా ఇది వైసీపీ రాజకీయ వికేంద్రీకరణగా కూడా చెప్పుకుంటున్నారు. తాను మాత్రమే కేంద్ర బిందువుగా ఉంటూ పార్టీని తన చుట్టూ తిప్పుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ నేతలకు బాధ్యతలు అప్పగించి వారి ద్వారా పార్టీ మీటింగ్స్ పెట్టిస్తున్నారు.

ఇపుడు సామాజిక సాధికారిక బస్సు యాత్ర పేరుతో వారినే ప్రజల వద్దకు పంపిస్తున్నారు. దీని వల్ల వైసీపీలో ప్రతీ ఒక్కరికీ పార్టీ మీద బాధ్యత పెరగడమే కాకుండా తాము అన్నింటా ఉన్నామని పార్టీ కోసం ఉన్నామన్న భావన కలుగుతుంది. అది పార్టీకి ఎంతో మేలు చేస్తుంది.

ఒక విధంగా జగన్ చేస్తున్నది కరెక్ట్ అని ఎదురుగా కనిపిస్తున్న టీడీపీని చూస్తే తెలుస్తుంది. టీడీపీలో కూడా సీనియర్లు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు ఎంతో మందికి పార్టీ పదవులు ఇచ్చారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు ఉన్నారు. సీనియర్ మోస్ట్ పొలిట్ బ్యూరో మెంబర్ గా యనమల రామక్రిహ్ణుడు, అశోక్ గజపతి రాజు, కళా వెంకటరావు, అయ్యన్నపాత్రుడు లాంటి వారు ఉన్నారు.

ఇలా సీనియర్ల టీం అంతా కలసి ఎందుకు ఒక బస్సు వేసుకుని జనంలోకి వెళ్లకూడదు అన్న చర్చ అయితే వస్తోంది. అయితే వారి తప్పు కూడా అది కాదేమో. వారికి కూడా వెళ్లాలని ఉంటుంది. కానీ టీడీపీ అధినాయకత్వం వారిని ఎంత వరకూ నమ్మి స్వేచ్చ ఇస్తుంది అన్నదే ఇక్కడ పాయింట్. సొంత బావమరిది బాలయ్యనే టీడీపీ పక్కన పెట్టేసింది అన్న చర్చ ఒక వైపు ఉంది.

ఎంతసేపూ కుటుంబాన్ని ముందు పెట్టి సెంటిమెంట్ ని పండిద్దామని సేఫ్ గేమ్ ఆడాలని మాత్రమే టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. దీంతోనే వైసీపీకి టీడీపీకి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు జనంలోకి వస్తున్నారు. ప్రజల వద్దకు వారు వెళ్తున్నారు. గడప గడపకు వారు కనిపిస్తున్నారు.

జగన్ పై స్థాయిలో ఉంటూ అన్నీ చూసుకుంటున్నారు. మరి జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారా అంటే ఆయన ఎన్నికల టైం కి మాత్రమే వస్తారని అంటున్నారు. ఆయన జిల్లాలలో మీటింగ్స్ అపుడు స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ఈ లోగా పార్టీని జనంలో ఉంచే బాధ్యత కీలక నేతలకే అప్పగించారని అంటున్నారు. ఎలా చూసుకున్నా జగన్ వ్యూహం సక్సెస్ అయ్యేలాగ ఉంది అని అంటున్నారు. ఈ విషయంలో ఫార్టీ ఇయర్స్ పార్టీ కేంద్రీకృత రాజకీయాలను చేస్తూంటే వైసీపీ వికేంద్రీకరణ మంత్రం అందుకుంటోంది.

Tags:    

Similar News