సీఎం టార్గెట్...ఏపీలో లా అండ్ ఆర్డర్...?

ఏపీలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. దానిని లీడ్ చేస్తోంది జగన్. అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఏపీలో లా అండ్ ఆర్డర్ ని సమీక్ష చేయాల్సి ఉంది అని అంటున్నారు.

Update: 2024-04-14 04:03 GMT

ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అన్నది మరోసారి చర్చకు వస్తోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బరితెగించి రాళ్లను విసరడం అంటే కచ్చితంగా ఇది భద్రతా వైఫల్యం గానే చూడాలని అంటున్నారు. ఒకసారి జరిగితే ఓకే. కానీ పది రోజుల వ్యవధిలో రెండు సార్లు అది సీఎం టార్గెట్ గా జరగడం అంటే దీనిని ఆషామాషీగా చూడకూడదు అని అంటున్నారు.

జగన్ మీద ఉమ్మడి అనంతపురం జిల్లా గుత్తిలో పట్టపగలే ఒక ఆగంతకుడు చెప్పుతో దాడి చేస్తే అది కాస్తా పక్కకు వెళ్ళింది. దాంతో గురి తప్పింది. అయినా ఆంగంతకుడు అంత సమీపానికి వచ్చి ప్లాన్ ప్రకారమే ఈ దాడి చేసారు అని అంతా అన్నారు. దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు అన్నది తెలియలేదు. అదే సమయంలో ముఖ్యమంత్రికి ఏమి సెక్యూరిటీ పరంగా కొత్త జాగ్రత్తలు తీసుకున్నారు అన్నది కూడా తెలియలేదు.

ఈలోగా విజయవాడలో ఎంట్రీ ఇస్తూనే సీఎం జగన్ మీద గురి చూసి మరీ దాడిని పాల్పడ్డారు. లక్కీగా కంటి పై భాగంలో గాయం అయిది అదే కంటికి తగిలినా లేక బుర్రకు తగిలినా పెను ప్రమాదమే అని అంటున్నారు ఇంకా నెల రోజులు బిగిసి ఎన్నికల ప్రచారం ఉంది. అసలైన ఘట్టం ఇంకా ముందు ఉంది.

ఈ కీలక సమయంలో సీఎం కి సెక్యూరిటీ లేకపోతే ఎలా అని అంటున్నారు. జూన్ 4 వరకూ జగనే సీఎం అన్నది తెలిసిందే. ఆ రోజున ఫలితాల తరువాత మళ్లీ ఆయన నెగ్గినా ప్రస్తుత టెర్మ్ కి రాజీనామా ఇచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. లేదా అవతల పక్షం గెలిస్తే వారు వచ్చేంతవరకూ సీఎం గా ఉంటారు. మరి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మీద దాడులు జరుగుతూంటే తప్పు ఎవరికి అన్నది చర్చకు వస్తోంది.


ఏపీలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. దానిని లీడ్ చేస్తోంది జగన్. అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఏపీలో లా అండ్ ఆర్డర్ ని సమీక్ష చేయాల్సి ఉంది అని అంటున్నారు. అంతే కాదు ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దాల్సి ఉంది అని అంటున్నారు. ఎన్నికల వరకూ ఎన్నికల సంఘం చూసుకుంటుంది. ఒక వేళ లా అండ్ ఆర్డర్ వంటి సమస్యలు వచ్చినా కేర్ టేకర్ ప్రభుత్వాన్నే ఆదేశిస్తుంది. ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన వ్యవస్థ అంటూ లేదు.

ఆ విధంగా చూస్తే ప్రభుత్వం పరంగా విధాన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు కానీ ఏపీలో సాధారణ పాలనతో పాటు ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ లా అండ్ ఆర్డర్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత సీఎం గా జగన్ మీద ఉంది అని అంటున్నారు. ఇక ఇంటలిజెన్స్ కూడా అలెర్ట్ కావాల్సి ఉందని అంటున్నారు. సీఎం అయినా విపక్ష నేతలు అయినా వారి పర్యటనలలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులతో పాటు అప్రమత్తం చేయాల్సిన కర్తవ్యం ఇంటలిజెన్స్ వర్గాల మీద ఉంది.

ఇదిలా ఉంటే ఆ మధ్యన ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వర్గాల నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. అందులో జగన్ టార్గెట్ గా కొన్ని వర్గాలు దాడికి ప్రయత్నం చేస్తాయి అని కూడా నివేదికలో ఉంది అని పేర్కొన్నారు. అప్పటికి జగన్ బస్సు యాత్ర కూడా అనుకోలేదు. ఆ తరువాత జగన్ బస్సు యాత్రకు రెడీ అవుతున్నప్పుడు ఈ విషయాలు చర్చకు వచ్చాయని కూడా అంటున్నారు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుని బస్సు యాత్రను చేయాలని వైసీపీ నిర్ణయించింది. కానీ ఇప్పటికే రెండు దాడులు జగన్ టార్గెట్ గా జరిగాయి కాబట్టి భద్రతాపరంగా అప్రమత్తం కావాల్సి ఉంది అంటున్నారు. అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు అలెర్ట్ కావాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News