జగన్ వర్సెస్ బాబు : ఏపీలో రాజకీయ తుపాన్!

ఒకే రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు బయల్దేరారు.

Update: 2023-12-08 16:51 GMT

ఏపీని నాలుగు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ అల్లల్లాడించి పోయింది. తుఫాన్ టైం లో ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటూ నిందించిన రాజకీయ పక్షాలు ఇపుడు తుఫాన్ వెళ్ళిపోగానే జనంలోకి వచ్చారు. ఒకే రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు బయల్దేరారు.

జగన్ అయితే తిరుపతి నుంచి మొదలెట్టి బాపట్ల జిల్లాకు వచ్చి రైతులు తుఫాన్ బాధితులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం కానీ ఓదార్పు మాటలు కానీ చంద్రబాబు మీద విమర్శలుగా సాగాయి. బాబు ఉన్న టైం లో తుఫాన్ వస్తే గాలికి వదిలేసేవారు అని తమ ప్రభుత్వం అలా కాదు ప్రజల కోసమే ఉందని జగన్ చెప్పారు.

గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ ఉందని దాంతో ప్రతీ ఇంటికీ నేరుగా వచ్చి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామ్ని జగన్ చెప్పుకున్నారు మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎవరో ఏదో చెబితే నమ్మవద్దు. అసలు ఆ టీడీపీ అనుకూల పత్రికలు చదవవచ్చు ఇంపుట్ సబ్సిటీ సహా ఏ సాయం మీకు దక్కదు అని ఎవరు అన్నా పట్టించుకోవద్దు. మీకు సాయం అందకపోతే నేరుగా 1902 నంబర్ కే ఫోన్ చేయండి అది నేరుగా సీఎం ఆఫీస్ కే వస్తుంది అని జగన్ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు రైతులకు చేసింది ఏమీ లేదని ఆయన హయాం అంతా కరవు కాటకాలే అని జగన్ దుయ్యబెట్టారు. తాము యుద్ధం చేస్తోంది కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదని మారీచులతో కూడా అని జగన్ విమర్శించారు. ఏపీలో తమ ప్రభుత్వం ఎంతో మంచి చేస్తూంటే చూసి ఓర్వలేని వారు బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు.

పదే పదే టీడీపీ అనుకూల మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తోంది ఆ వార్తలు చూడవద్దు వినవద్దు అని జగన్ గట్టిగానే చెప్పేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబు సైతం జగన్ మీద విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం ఉండేది మూడు నెలలు మాత్రమే అని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని తాము వారిని అడగమని కూడా బాబు అంటున్నారు.

ఎందుకంటే ఈ ప్రభుత్వం చేయకపోతే మూడు నెలలు ఆగితే తామే అధికారంలోకి వచ్చి రైతులకు చేయాల్సింది అంతా చేస్తామని అన్నారు. ప్రకృతి విపత్తులు వస్తే మంత్రులు ఎక్కడ అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి రైతులు అన్నా ప్రజలు అన్నా లెక్క లేదు అని బాబు నిప్పులు చెరిగారు.

ఏపీలో పెద్ద ఎత్తున తుఫాన్ విరుచుకుని పడితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం దారుణం అన్నారు. తాను తుఫాన్ బాధితులను పరామర్శిస్తాను అని తెలిసి ముఖ్యమంత్రి తానూ బయల్దేరారని అంతే తప్ప ప్రేమ కాదని, పైగా తుఫాన్ ప్రభావం ఉన్న చోట కాకుండా వేరే చోట్ల ఆయన పర్యటనలు చేయడమేంటి అని చంద్రబాబు నిలదీశారు.

మొత్తానికి చేస్తున్నది ఇద్దరూ తుఫాన్ బాధితుల పరామర్శ కానీ బాబు మీద జగన్ అలాగే జగన్ మీద బాబు విమర్శలతో రాజకీయ తుఫాన్ నే తెచ్చేశారు అని అంటున్నారు. మరి జనాలు ఎలా రియాక్టు అవుతున్నారో ఈ రోజుకీ చేలలో నీళ్ళు నిలిచి ఉన్నాయి. నిరాశ్రయులుగా జనాలు ఉన్నారు. వారికి రాజకీయం కాదు కావాల్సింది సాయం. కానీ ఎన్నికల దగ్గర వచ్చిన మిచౌంగ్ తుఫాన్ తానూ పోతూ కూడా రాజకీయ సెగనే రాజేసి పోయింది అని అంటున్నారు.

Tags:    

Similar News