మోడీతో భేటీకి జగన్ తహతహ...మ్యాటరేంటో...?

ఈ నేపధ్యంలోనే ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ జగన్ లేఖ రాసారు అని ప్రచారం సాగుతోంది. ఏపీలో పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే మైనారిటీ యువకుడిని దారుణంగా హత్య చేశారు.

Update: 2024-07-19 13:59 GMT

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాని మోడీతో భేటీకి తహతహలాడుతున్నారా అంటే ఆయన తాజాగా ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ రాసిన లేఖ చూస్తే అదే అని అంటున్నారు. ఎందుకిలా అంటే ఏపీలో రాజకీయ పరిస్థితులు అలాగే ఉన్నాయి. దాంతో పాటు దారుణంగా ఓడిన తరువాత వైసీపీ కూడా ఇబ్బందులో పడిపోయింది.

ఈ నేపధ్యంలో అన్నీ తట్టుకుని నిలబడాలీ అంటే ఏదో ఒకటి చేయాల్సిందే అన్న మాట అయితే ఉంది. ఈ నేపధ్యంలోనే ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ జగన్ లేఖ రాసారు అని ప్రచారం సాగుతోంది. ఏపీలో పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే మైనారిటీ యువకుడిని దారుణంగా హత్య చేశారు. దాని మీద వైసీపీ తీవ్రాతితీవ్రంగా ఖండించింది.

ఇది రాజకీయ హత్య అని కూడా చెబుతోంది. ఆయన్ని టీడీపీకి చెందిన ప్రత్యర్ధి హత్య చేశాడని చెబుతున్నారు. దీని కంటే ముందుంగా గత నెలన్నర రోజులుగా ఏపీలో దారుణంగా హత్యా రాజకీయాలు సాగుతున్నాయని వైసీపీ అంటోంది. వీటికి పరాకాష్ట అన్నట్లుగా రషీద్ హత్య ఉందని పేర్కొంటూ ఇప్పటికే రాష్ట్రపతికి కూడా లేఖను వైసీపీ రాసింది.వైసీపీ అధ్యక్షుని హోదాలో జగన్ కూడా ప్రధానికి లేఖ రాస్తూ అపాయింట్మెంట్ కోరారని అంటున్నారు.

కూటమి ప్రభుత్వం ఏపీలో హింసా రాజకీయాలకు తెర లేపిందని జగన్ రాసిన లేఖలో ప్రధాని దృష్టికి తెచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇప్పటిదాకా 31 మందిని హత్య చేశారని మరో 300 మంది మీద హత్యాయత్నం జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతే కాదు కూటమి వేధింపులు భరించలేక వేలల్లో కుటుంబాలు రాష్ట్రం విడిచి వెళ్ళిపోయాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఆఖరుకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సైతం వేధింపులు తప్పడంలేదని ఆయన ప్రధాని దృష్టిలో ఉంచారని అంటున్నారు.

ఏపీలో రాజ్యాంగబద్ధమైన పాలన సాగడం లేదని రెడ్ బుక్ పాలన సాగుతోందని జగన్ అంటున్నారు. ఈ విషయాలను వివరించడానికి తనకు తగిన సమయం ఇవ్వాలని ఆయన ప్రధానికి రాసిన లేఖలో కోరారు. అయితే ఈ లేఖ మీద ప్రధాని ఎలా రియాక్ట్ అవుతారు అన్న చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. అలాగే కేంద్రంలోని ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలు ఆక్సిజన్ గా ఉన్నారు.

దాంతో టీడీపీ విలువ ఏంటో మోడీకి తెలుసు అని అంటున్నారు. దాంతో పాటుగా చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న జగన్ కి అపాయింట్మెంట్ ఇస్తే అది వేరే సంకేతాలకు తెర తీస్తుందని కూడా అంటున్నారు. గతంలో కూడా అంటే 2014 నుంచి 2019 మధ్యలో జగన్ కి ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చిన నేపధ్యంలోనే టీడీపీ గుస్సా అయి చివరికి దూరం అయింది.

ఆనాడు టీడీపీ దూరం అయినా ఫరవాలేదు కానీ ఇపుడు ఆ పార్టీ మద్దతు అత్యంత కీలకం. దాంతో బీజేపీ కానీ మోడీ కానీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టే చర్యలను తీసుకోరని అంటున్నారు. అయితే రాజ్యసభలో బీజేపీకి వైసీపీ మద్దతు కావాల్సిన అవసరం కూడా ఉంది. దానిని ఎవరూ కొట్టిపారేయడం లేదు. ఆ విధంగా చూస్తే చంద్రబాబు లోక్ సభలో ఎలాగో రాజ్యసభలో జగన్ అలాగ అని కూడా అంటున్నారు.

మరి ఈ ఈక్వేషన్స్ చూసుకున్నపుడు జగన్ కి అపాయింట్మెంట్ ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. ప్రధాని ఎవరైకైనా అపాయింట్మెంట్ ఇవ్వవచ్చు. అందులో ఏమీ తప్పు పట్టేదీ ఉండదు, అందునా ఒక మాజీ సీఎం ఏపీలో ప్రతిపక్ష నాయకుడికి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడితే తప్పు లేదు కానీ ఇక్కడ జగన్ ఆరోపిస్తోందే కూటమి ప్రభుత్వం మీద. అలాగే చంద్రబాబు మీద. దాంతో మోడీ ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే చర్చకు వస్తున్న విషయం అని అంటున్నారు. చూడాలి మరి మోడీతో జగన్ భేటీ ఉంటుందా లేదా అన్నది.

ఇక మోడీతో భేటీ కనుక జరిగితే జగన్ సైతం రాజకీయంగా పావులు కదుపుతారని అంటున్నారు. అంటే 2014 నుంచి 2019 మధ్యలో ఎలా చేశారో అలా అని అంటున్నారు. కేంద్రంతో దోస్తీ ఏపీతో కుస్తీ అన్నట్లుగా చేయడానికే ప్లాన్ అని అంటున్నారు. మరి బీజేపీ అంత అవకాశం ఇస్తుందా అన్నదే బిగ్ క్వశ్చన్.

Tags:    

Similar News