వైఎస్సార్ లక్ జగన్ కి కూడా దక్కుతుందా ?
ఒక విధంగా టీడీపీ కూటమి ఆ ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సి ఉంది. అయితే అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ మొత్తానికి మొత్తం సీట్లకు పోటీ చేయడం ద్వారా భారీగా ఓట్లను చీల్చేసింది.
ఉమ్మడి ఏపీకి రెండు సార్లు సీఎం గా పనిచేసిన ఘనత వైఎస్సార్ ది. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో ఈ అరుదైన ఘనతను సాధించిన అతి కొద్ది కాంగ్రెస్ సీఎంలలో వైఎస్సార్ ఒకరు. తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే అయిదేళ్ల పాటు ఫుల్ టెర్మ్ చేసి ఎన్నికలకు వెళ్ళి మళ్లీ గెలిచి సీఎం గా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేతగా కూడా వైఎస్సార్ ని చూడాల్సి ఉంది.
వైఎస్సార్ కి ఈ ఘనత దక్కడం వెనక ఆయన ఇమేజ్ కాంగ్రెస్ అధినాయకత్వం ఆయన మీద పెట్టుకున్న నమ్మకంతో పాటు ఆయనకు లక్ కూడా కలసి వచ్చిందని చెప్పాలి. అప్పటిదాకా చూస్తే కనుక తెలుగుదేశం వరసగా రెండు సార్లు గెలిచింది తప్ప కాంగ్రెస్ కి ఆ ఘనత దక్కలేదు. ఇక 2004లో ఘోరంగా ఓడిన టీడీపీ 2009 నాటికి మహా కూటమి కట్టి కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇచ్చింది.
ఒక విధంగా టీడీపీ కూటమి ఆ ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సి ఉంది. అయితే అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ మొత్తానికి మొత్తం సీట్లకు పోటీ చేయడం ద్వారా భారీగా ఓట్లను చీల్చేసింది. అలాగే లోక్ సత్తా పేరిట జయ ప్రకాష్ నారాయణ్ పెట్టిన పార్టీ అర్బన్ ఓటర్లలో చీలిక తెచ్చింది. ఈ రెండూ జరగకపోయి ఉంటే టీడీపీ గెలిచేది కాంగ్రెస్ ఓడేది అన్నది అనంతర ఫలితాలు ఓటు షేర్ వచ్చిన సీట్లు చూస్తే చేసిన ఒక అర్ధవంతమైన విశ్లేషణ.
అలా వైఎస్సార్ రెండు సార్లు వరసగా గెలిచి ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేశారు. ఇపుడు ఆయన తనయుడు జగన్ కూడా అదే సెంటిమెంట్ ని అందిపుచ్చుకుని రెండో సారి ఏపీలో వరసగా గెలిచి సీఎం అవుతారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే నాటి వైఎస్సార్ కి అన్నింటితో పాటు లక్ కూడా కలసి వచ్చి ప్రజారాజ్యం లోక్ సత్తాల రూపంలో టీడీపీకి దెబ్బ పడింది.
మరి వైసీపీకి అలాంటి లక్ ఉందా అన్నదే చర్చ. ఏపీలో టీడీపీ కూటమి బలంగా ఉంది. దాదాపుగా వైసీపీ వ్యతిరేక ఓట్లను అన్నింటినీ ఒడిసి పట్టుకునే స్థాయిలో ఉంది. కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కూడిన ఇండియా కూటమి ఏపీలో ఉన్నా అది నామమాత్రంగానే ఉంటుందని అంటున్నారు. పైగా ఈ కూటమి ఓట్లు ఏమైనా చీలితే అవి వైసీపీ అనుకూల ఓట్లే చీలుస్తాయని కూడా అంటున్నారు.
అదెలా అంటే ఎస్టీలు ఎస్సీలు, మైనారిటీలు ఓట్లు కాంగ్రెస్ కి పడతాయి. అలాగే కమ్యూనిస్టులకు పడతాయి. మిగిలిన సెక్షన్ల ఓట్లను ఈ పార్టీలు పెద్దగా చీల్చలేవు అని అంటున్నారు. దాంతో ఈసారి వైసీపీకి ఎన్నికల్లో రెండిందాల పోటు తగులుతోంది అని అంటున్నారు. వ్యతిరేక ఓటు అన్నది టీడీపీ కూటమి కాప్చర్ చేస్తే అనుకూల ఓట్లకు గండి పెట్టేందుకు ఇండియా కూటమి రెడీగా ఉంది అని అంటున్నారు.
ఉదాహరణకు బీజేపీ ప్రవచిస్తున్న ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అన్న దాని మీద మండుతున్న ఆయా సెక్షన్లు కోపంతో వైసీపీకి ఓటు చేయవచ్చు లేకపోతే ఇండియా కూటమి వైపు కూడా మళ్ళ వచ్చు అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీకి ఓటు వేసినా బీజేపీకే మద్దతు ఇస్తారు అన్న ప్రచారం ఉన్న నేపధ్యంలో ఇండియా కూటమి అలాగే విమర్శిస్తున్న క్రమంలో ఆయా వర్గాలు ఇండియా కూటమి వైపు వస్తాయని అంటున్నారు. పూర్తిగా రాకపోయినా కొంతలో కొంత అటు మళ్ళినా ఆ మేరకు వైసీపీకే నష్టం అని అంటున్నారు.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద బీజీపే మీద మండుతున్న ఉద్యోగ కార్మికుల ఓట్లు టీడీపీ కూటమికి పడవు అనుకుంటే వైసీపీకి మళ్ళాలి. కానీ వైసీపీ కూడా బీజేపీ కి పరోక్ష దోస్తు అని వామపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. దాంతో ఆ ఓట్లలో కూడా అత్యధిక శాతం ఇండియా కూటమికే పడవచ్చు అని అంటున్నారు.
అదే జరిగితే బీజేపీతో ఉన్న ఎన్డీయే కూటమికి కలిగే నష్టాన్ని ఇండియా కూటమి భర్తీ చేస్తుందని దాంతో వైసీపీకి అదనపు ప్రయోజనం ఏమీ సమకూరదు అని అంటున్నారు. దాంతో వైసీపీకి వైఎస్సార్ కి 2009లో కలిగిన వ్యతిరేక ఓట్ల చీలిక లక్ తగిలే ఛాన్స్ ఉందా అంటే ప్రస్తుతానికి అయితే లేదు అనే అంటున్నారు. మరి వేవ్ బలంగా ఉంటే కనుక వైసీపీని ఎవరూ ఏమీ చేయలేరని లేకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.