సైలెంట్ గా టీడీపీకి ఎర్త్ పెడుతున్న జనసేన...?

ఇవన్నీ చూసినపుడు జనసేన సైలెంట్ గా టీడీపీ కి ఎర్త్ పెట్టేస్తోందా అన్న సందేహం అయితే వస్తోంది అంటున్నారు.

Update: 2023-07-27 23:30 GMT

ఏపీ రాజకీయాల లో జనసేన దూకుడు చేస్తోంది. వారాహి యాత్ర ఇచ్చిన ఊపుతో పాటు బీజేపీ కేంద్ర నాయకత్వం పిలిచి పెద్ద పీట వేసిన తరువాత వచ్చిన హుషార్ అన్నీ కలసి జనసేన లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఏపీ లో పొత్తులు ఎవరితో ఎవరికి కుదురుతాయో తెలియడంలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ లో 2024లో ఏర్పడబోయేది ఎన్డీయే సర్కార్ అని స్పష్టం చేశారు.

మరో వైపు చూస్తే టీడీపీ జనసేన బీజేపీ కలసి ముందుకు సాగాల ని వైసీపీ వ్యతిరేక ఓటుని చీలకుండా చేయాలని పవన్ కళ్యాణ్ శపధం చేశారు. అయితే వారాహి యాత్ర తరువాత పవన్ ఆలోచనలు మారాయా అన్నదే చర్చకు వస్తోంది. పొత్తులు కుదిరినా లేకపోయినా తనను నమ్ముకుని పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను ఆయా కీలక నియోజకవర్గాల కు ఇంచార్జీలుగా నియమించేస్తూ పవన్ జోరు చేస్తున్నారు.

అలా ఉమ్మడి గోదావరి జిల్లాల లో పిఠాపురం, కోవూరు తదితర సీట్లలో అభ్యర్ధులను ప్రకటించేశారు. ఇపుడు ఆయన రాయలసీమకు ముఖ్య కేంద్రంగా ఉన్న తిరుపతికి క్యాండిడేట్ ని డిక్లేర్ చేసి పారేశారు. తిరుపతికి పసుపులేటి హరి ప్రసాద్ ని ఇంచార్జిగా జనసేన ప్రకటించినట్లుగా తెలుస్తుంది. హరి ప్రసాద్ జనసేన లో కీలక నేత. దాంతో ఆయన కు టికెట్ ఇవ్వాలనుకోవడం కచ్చితంగా పవన్ తీసుకున్న నిర్ణయం.

ఇదిలా ఉంటే తిరుపతి నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణ అల్లుడుతో పాటు మరి కొందరు ట్రై చేస్తున్నారు. ఈ టైం లో సడెన్ గా జనసేన తన క్యాండిడేట్ ని డిక్లేర్ చేసింది అంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో టీడీపీ లో చర్చ సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో పొత్తులు కుదిరినా పవన్ ఇంచార్జిలుగా నియమించిన వారు కచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్ధులు అవుతారు అని అంటున్నారు. అలా తిరుపతి సీటు టీడీపీ వదులుకోవాల్సిందే అని అంటున్నారు. తిరుపతి సీటు ని జనసేన కు ఇస్తే టీడీపీ సహకరిస్తుందా అన్నది మరో చర్చగా ఉంది. అలా కాదని పొత్తు లేదు అని ఊరుకుంటే జనసేన వల్ల వైసీపీ విజయం పక్కా అని అంటున్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కేవలం 750 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. ఇక్కడ జనసేన కు 12 వేల దాకా ఓట్లు వచ్చాయి. దాంతో జనసేనతో పొత్తు కాదనుకోలేని స్థితిలో టీడీపీ ఉంది అని అంత్టున్నారు. దాంతో జనసేన అయితే తన అభ్యర్థుల ను వరసగా ప్రకటించుకుని పోతోంది అని అంటున్నారు.

ముందు పొత్తు ఆ తరువాత సీట్ల బేరం అని టీడీపీ భావిస్తూంటే తమకు కావాల్సిన సీట్లలో జనసేన అభ్యర్ధుల ను ప్రకటించేస్తూ పొత్తులు కుదిరితే గరిష్టంగా పెద్ద నంబర్ తోనే రావాలని అనుకుంటోంది. సో ఇవన్నీ చూసినపుడు జనసేన సైలెంట్ గా టీడీపీ కి ఎర్త్ పెట్టేస్తోందా అన్న సందేహం అయితే వస్తోంది అంటున్నారు.

Tags:    

Similar News