జనసేన అసలు పార్టీనే కాదు.. : సాయిరెడ్డి
తాజాగా అధికార పార్టీ వైసీపీ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఎన్నికల సంఘం కమిషనర్లను కలుసుకున్నారు.
ఏపీలో ఎన్నికల వేడి మరింత సెగలు పుట్టిస్తోంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు.. విజయ వాడకు వచ్చారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వ హణ వంటివాటిపై చర్చిస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా వారు రాజకీయ పార్టీల నాయకులతోనూ భేటీ అయ్యారు. తాజాగా అధికార పార్టీ వైసీపీ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఎన్నికల సంఘం కమిషనర్లను కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌పై దుర్భాషలాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కమిషనర్లకు విన్నవించినట్టు తెలి పారు. అసలు జనసేన పార్టీని ఎలా అనుమతించారని ప్రశ్నించినట్టు చెప్పారు. జనసేన అసలు పార్టీనే కాదని, ఎన్నికల సంఘం గుర్తించలేదని అన్నారు. గ్లాసు గుర్తు కేవలం .. జనరల్ సింబల్ మాత్రమేనని తెలిపారు. అలాంటి పార్టీని ఎందుకు కలిశారని ప్రశ్నించామన్నారు.
మొత్తంగా ఆరు అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినట్టు సాయిరెడ్డి వివరించారు. రాష్ట్రంలో వైసీపీ సానుభూతిపరులు, వైసీపీ ఓటర్లను టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తున్న విషయాన్ని వివరించామన్నారు. టీడీపీ ఎన్నికల పరిశీలకుడిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపా రు. నారా లోకేష్ రెడ్ బుక్ వ్యవహారంపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు.