జనసేన అసంతృప్తులు జేడీ పార్టీలోకి....!?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు. ఏపీ రాజకీయాల్లో అది సంచలనం గా ఉంది

Update: 2023-12-23 02:30 GMT

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు. ఏపీ రాజకీయాల్లో అది సంచలనం గా ఉంది. ఒక ఉన్నత అధికారి రాజకీయాల్లోకి రావాలని తపించడం ఒక ఎత్తు అయితే ఆయన ఉద్యోగాన్ని సైతం స్వచ్చందంగా రాజీనామా చేసి బయటకు రావడం మరో విషయం. జేడీ సరైన టైం లో పార్టీ పెట్టారు అని అంటున్నారు.

ఏపీలో మూడవ ఆల్టర్నేషన్ రావాలి కావాలి అని అంతా కోరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే అలా ఉంటారని భావించారు. కానీ ఆయన పొత్తుల పేరుతో టీడీపీ వైపు వచ్చేశారు. ఇక జనసేనలో చేరిన వారు ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం ఆశలు అన్నీ కూడా అయోమయంలో పడిన వేళ అదే సామాజిక వర్గానికి చెందిన జేడీ పార్టీ పెట్టారు.

జేడీ ఏపీలో ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు. అంతే కాదు ఆయనకంటూ యువతలో క్రేజ్ ఉంది. దాంతో జేడీ వెంట నడవడానికి చాలా మంది చూస్తున్నారు అని అంటున్నారు. ఇక జేడీ పార్టీ ప్రకటన ఏమీ సడెన్ గా జరగలేదు అని అంటున్నారు. వ్యూహాత్మకంగానే ఆయన పార్టీని ప్రకటించారు అని అంటున్నారు. పార్టీని ఆయన సరిగ్గా ఏడాది క్రితమే రిజిస్ట్రేషన్ చేయించారు అని అంటున్నారు.

అంటే ఆయన మదిలో చాలా ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. అన్ని ఏర్పాట్లూ చేసుకుని జేడీ పార్టీని అనౌన్స్ చేశారు అని అంటున్నారు. ఏపీలో ఇపుడు రాజకీయ హడావుడి ఉంది. వైసీపీలో టికెట్లు రాని వారు ఎటూ వెళ్లని వారు కూడా ఉన్నారు. అలాగే జనసేనలో ఉన్న వారు కూడా టీడీపీతో పొత్తుల వల్ల అవకాశాలు లేకుండా పోతున్నారు. అదే విధంగా పొత్తును వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారు.

వీరికి కూడా ఒక రాజకీయ వేదిక కావాలని అంటున్నారు. దాంతో జనసేనలో పనిచేసిన జేడీ వైపే వారు చూస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా జనసేన నుంచి వలసలు ఉంటాయని అంటున్నారు. అదే విధంగా వైసీపీ నుంచి కూడా చేరే వారు ఉంటారని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో పోటీకి ఆప్ చూస్తోంది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చూస్తున్నారు. దాంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని జేడీ ఏపీలో పోటీ చేస్తారు అని అంటున్నారు. యువత రైతులు గ్రామీణం అంటూ జేడీ అజెండాను రూపొందిస్తున్నారు.

అలాగే బడుగు బలహీనులకు రాజ్యాధికారం అని నినదిస్తున్నారు. ఇప్పటిదాకా రాజ్యాధికారం అందని వారి కోసమే తన కొత్త పార్టీ అని జేడీ చెబుతున్నారు. ఏది ఏమైనా జేడీ కొత్త పార్టీ ఎంత మేరకు ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపించగలదు అన్నది ఆసక్తికరమైన చర్చగా ఉంది. జేడీ టార్గెట్ ఎవరు అన్నది కూడా ప్రశ్నగా ఉంది.

Tags:    

Similar News