జనసేన ఎంపీ అభ్యర్ధులు వీరే...!

టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు మూడు ఎంపీ సీట్లు లభించాయి. ఈ విషయాన్ని చంద్రబాబు పవన్ ఇద్దరూ ఉమ్మడి వేదిక మీద ప్రకటించారు

Update: 2024-02-26 03:43 GMT

టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు మూడు ఎంపీ సీట్లు లభించాయి. ఈ విషయాన్ని చంద్రబాబు పవన్ ఇద్దరూ ఉమ్మడి వేదిక మీద ప్రకటించారు. ఈ నేపధ్యంలో మొత్తం 24 అసెంబ్లీ సీట్లకు గానూ అయిదుగురు అభ్యర్ధులను జనసేన ఎంపిక చేసింది. మిగిలిన చోట్ల ఎంపిక చేయాల్సి ఉంది.

తొందరలో ఆ లిస్ట్ బయటకు వస్తుంది. ఇక జనసేనకు ఇస్తున్న మూడు ఎంపీ సీట్లలో అభ్యర్ధులు కూడా ఎంపిక చేసేశారు అని అంటున్నారు. అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేయనుండగా మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేయబోతున్నారు.

కాకినాడ కూడా జనసేనకే ఇస్తున్నారు. ఈ సీటు నుంచి సానా సతీష్ పోటీ చేస్తారు అని అంటున్నారు. అయితే కాకినాడ సీటు విషయంలో సందేహాలు ఉన్నాయని అంటున్నారు. పొత్తులోకి బీజేపీ ఎంటర్ అయితే ఆ పార్టీ కోరుకునే ఎంపీ సీట్లలో కాకినాడ ఉంటుందని అంటున్నారు. అపుడు జనసేన వేరే చోటు నుంచి పోటీ చేయాల్సి వస్తుంది.

ఆ నేపధ్యంలో జనసేన ఎంపీ సీటూ అభ్యర్ధి కూడా మారుతారు అని అంటున్నారు. ఏది ఏమైనా నాగబాబు అనకాపల్లికి ఫిక్స్ అని అంటున్నారు. అలాగే బాలశౌరి మచిలీపట్నం నుంచి టికెట్ హామీతోనే వచ్చారు అని అంటున్నారు. సో జనసేనకు మూడు ఎంపీ సీట్లకు అభ్యర్ధులు కన్ ఫర్మ్ అయిపోయారు.

అయితే జనసేన మరో రెండు ఎంపీ సీట్లు కూడా కోరుతోందని టాక్ నడుస్తోంది. అవి రాయలసీమలో ఒకటి మధ్యాంధ్రలో మరోటి అని అంటున్నారు. మరి ఆ రెండు సీట్లు టీడీపీ ఇస్తే కనుక జనసేనకు అయిదుగురు ఎంపీలు ఇచ్చినట్లు అవుతుంది. అయితే టీడీపీ ఇచ్చే అవకాశాలు తక్కువే అని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ నంబరే ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. సో జనసేనకు ఎంపీ అభ్యర్ధులు వీరే అని అనుకోవాలి.

Tags:    

Similar News