పవన్ టిక్కెట్లు ఎప్పుడు ఇస్తావ్.. నేతల గగ్గోలు...!
కానీ, ఎటొచ్చీ.. జనసేనలో మాత్రం ఇంకా టికెట్లు ఊసు.. ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడమూ లేదు.
ఎన్నికలకు సమయం చేరువ అవుతుండడంతో జనసేన వర్గాలలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి కి మూడు దఫాలుగా వారాహి యాత్రలు చేస్తున్నా.. తమకు స్వాంతన లేకుండా పోతోందని వారు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీలో దాదాపు సగానికిపైగానే టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. దీంతో వారంతా తమ పనితాము చేసుకుంటున్నారు. ప్రజలకు కూడా చేరువ అవుతున్నారు.
కానీ, ఎటొచ్చీ.. జనసేనలో మాత్రం ఇంకా టికెట్లు ఊసు.. ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడమూ లేదు. కేవలం ఒక్క నాదెండ్ల మనోహర్‌కు మాత్రమే తెనాలి నుంచి పోటీ చేస్తారని అభయం ఇచ్చారు. మహా అయితే.. మరో రెండు టికెట్లలో ఆల్టర్నేట్ లేనందున.. అక్కడున్న నాయకులకే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? వారికి టికెట్లు ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్‌గా మారింది.
నియోజకవర్గస్థాయిలో ఇప్పటి వరకు జనసేన మీటింగులు పెట్టడం లేదు. క్షేత్రస్థాయిలో అనుసరించా ల్సిన వ్యూహంపైనా చర్చించడం లేదు. మీ పాటికి మీరే ఒక అజెండాను ఏర్పాటు చేసుకుని.. కార్యక్రమా లు నిర్వహించాలనిమాత్రమే పార్టీలో కీలక నేతలు చెబుతున్నారు. కానీ, ఇంతా చేసుకుని.. జేబులో ఉన్న రూపాయి ఖర్చు చేస్తే.. తర్వాత టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయిం ది.
ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తమకు టికెట్లు ప్రకటించాలని.. చాలా నాయకులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల రెండు వారాహి యాత్రల్లోనూ ఒకరిద్దరు ఇంకేముంది.. తమకు సీట్లను కన్ఫర్మ్ చేస్తారని అనుకున్నారు. కానీ, ఎక్కడా ఎవరికీ ఎలాంటి టికెట్లు ఇవ్వలేదు. ఇప్పుడు వారాహి 3.0ను సాగిస్తున్నారు. ఈ యాత్ర మరో 7 రోజులు సాగనుంది. ఈ సందర్భంగా అయినా.. తమకు టికెట్లు ప్రకటించాలని అరడజను మంది వరకు నాయకులు ఎదురు చూస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.