త‌గ్గేదేలే.. జంగా సంచ‌ల‌న నిర్ణ‌యం.. కాసుకు ద‌డద‌డ‌..!

గుర‌జాల నియోజ‌క వర్గం లో త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతున్నారు బీసీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి. తాజా గా ఆయ‌న‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లే చేశారు.

Update: 2023-12-18 11:30 GMT

"ఈ సీటు నాదే. నేనేపోటీ చేస్తా. దీనికి జ‌గ‌న్ కూడా జెండా ఊపుతారు!" అంటూ.. గుర‌జాల నియోజ‌క వర్గం లో త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతున్నారు బీసీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి. తాజా గా ఆయ‌న‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లే చేశారు. వాస్త‌వానికి 2019లోనే ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేయాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా కాసు మ‌హేష్‌రెడ్డి తెర‌మీదికి రావ‌డంతో జంగా వెన‌క్కి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు ఎమ్మెల్యేతో జంగాకు పొస‌గ‌డంలేదు.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే ఇక్క‌డ పోటీ చేయాల‌ని జంగా భీష్మించుకున్నారు. ఈ క్ర‌మంలో పాత సంగ‌తులుకూడా ఆయ‌న త‌వ్వుతున్నారు. "2011లో ఎవరు జండా మోయ‌ని స‌మ‌యంలో వైసీపీ జెండాను భుజాన వేసుకొని ఊరూరా తిరిగాను. పార్టీని బ‌లోపేతం చేశాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పార్టీ అధికారంలో రావటానికి కృషి చేశాను. ఇప్పుడు మీరొచ్చి.. మాపై పెత్త‌నం చేస్తామంటే స‌హించేది లేదు. మా నియోజ‌క‌వ‌ర్గంలో మేమే గెలుస్తాం" అంటూ జంగా వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్‌ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్ర‌జ‌లు బ్రహ్మరథం పడుతుంటే గురజాలలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని ప‌రోక్షంగా ఎమ్మెల్యే కాసుపై జంగా నిప్పులు కురిపిస్తున్నారు. ఇక మీ ఆటలు సాగనివ్వబోమంటూ.. ప‌రోక్షంగా జంగా హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు. 2024 ఎన్నిక‌ల్లో తానే పోటీ చేస్తాన‌ని కృష్ణమూర్తి స్ప‌ష్టం చేసేశారు.

ఇక‌, ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదేలే అన్న‌ట్టుగా కూడా ఆయ‌న తేల్చి చెప్పేశారు. మ‌రి.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే కాసు మ‌హేష్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ రాజ‌కీయాలు భ‌గ్గుమన‌డ‌మే కాదు.. నాయ‌కుల‌మ‌ధ్య వ్య‌క్తిగ‌త వైరాన్ని కూడా భారీ స్థాయిలో పెంచేశాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, త్వ‌ర‌లోనే గుంటూరు జిల్లాపై దృష్టి పెట్ట‌నున్న వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News