భేటీలో కీలక నిర్ణయాలు... తెరపైకి జనసేన పోటీ చేసే స్థానాలు!
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు... పవన్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. ఇందులో భాగంగా సీట్ల సర్ధుబాటుపై వీరిద్దరిమధ్య చర్చ సాగిందని తెలుస్తుంది.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ టీడీపీ - జనసేన పొత్తు ముందుకు కదులుతున్న సమయంలో ఊహించని రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు... జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన వీరి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా జనసేనకు కేటాయించబోయే సీట్ల ఎంపిక చుట్టూ చర్చ జరిగిందని సమాచారం. ఈ సమయంలో సీట్లపై ఒక స్పష్టత వచ్చిందని తెలుస్తుంది.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు... పవన్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. ఇందులో భాగంగా సీట్ల సర్ధుబాటుపై వీరిద్దరిమధ్య చర్చ సాగిందని తెలుస్తుంది. ఈ సమయంలో 2019 ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన స్థానాలతో పాటు 2009లో ప్రజారాజ్యం గెలిచిన స్థానాలను కూడా బేరీజు వేసుకుంటూ జనసేన ఒక జాబితా తయారుచేసిందని.. అందులో ప్రస్తుతానికి 28 స్థానాలపై ఇరుపక్షాలకూ క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది. అయితే ఈ లిస్ట్ లో టీడీపీకి అత్యంత కీలకమైన నేతల స్థానాలు కూడా ఉండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి 28స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుందని తెలుస్తుంది! ఇందులో అత్యధికంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉన్నాయి! వాస్తవానికి ఒక్కో పార్లమెంట్ స్థానానికి రెండేసి చొప్పున అసెంబ్లీ టిక్కెట్లు కావాలని జనసేన మొదటినంచీ డిమాండ్ చేసిందని చెబుతుంటారు. అయితే టీడీపీ మాత్రం ఒక్కో లోక్ సభ స్థానంలోనూ ఒక్కో అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామని చెప్పినట్లు కథనాలొచ్చేవి. ఈ సమయంలో 28స్థానాలపై క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది.
ఇందులో ప్రధానంగా భీమిలి నియోజకవర్గం పేరు కూడా ఉండటం గమనార్హం. కారణం... ఈ దఫా టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు ఆ స్థానం నుంచే పోటీ చేయబోతున్నారని అంటున్నారు. అయితే... ఈ స్థానంలో జనసేన పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. మరోపక్క టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అటు రాజోలు కానీ, ఇటు పి.గన్నవరం నుంచి కానీ పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో... ఆ రెండు స్థానాల్లోనూ జనసేన పోటీ చేయొచ్చని తెలుస్తుండటం ఆసక్తిగా మారింది.
రాజోలు నియోజకవర్గాన్ని జనసేన తన కంచుకోటగా చెప్పుకుంటున్న నేపథ్యంలో... సెంటిమెంట్ గా చూసినా తొలిసారి పార్టీ గెలిచిన స్థానం కావడంతో కచ్చితంగా ఆ స్థానాన్ని వదులుకోరని అనుకోవాలి. ఇక పి. గన్నవరం విషయానికొస్తే.. ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై కార్యకర్తల్లోను, ప్రజల్లోనూ అసంతృప్తి పుష్కలంగా ఉందని కథనాలొస్తున్న వేళ... అక్కడ గెలుపుపై కూడా జనసేన ధీమా వ్యక్తం చేస్తుందని అంటున్నారు. ఈ సమయంలో గొల్లపల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరుసగా గెలిచిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కూడా జనసేన ఖాతాలో పడిందని అంటున్నారు. ఇక్కడ నుంచి జనసేన తరుపున ఆ పార్టీ కీలక నేత కందుల దుర్గేష్ పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ సమయంలో బుచ్చయ్య చౌదరికి ఏస్థానాన్ని కేటాయిస్తారు, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో జనసేన పోటీ చేసే అవకాశాలున్న 28స్థానాలూ ఏమిటనేవి ఇప్పుడు చూద్దాం.!
నెలిమర్ల
భీమిలి
గాజువాక
యలమంచిలి / పెందుర్తి
పాడేరు
రాజానగరం
రాజమండ్రి రూరల్
కాకినాడ రూరల్
పిఠాపురం
పి.గన్నవరం
రాజోలు
నరసాపురం
భీమవరం
తాడేపల్లిగూడెం
ఉంగుటూరు / ఏలూరు
నిడదవోలు / తణుకు
కొవ్వురు
అవనిగడ్డ
విజయవాడ వెస్ట్
పెడన
తెనాలి
గుంటూరు వెస్ట్
గిద్దలూరు
దర్శి
నెల్లూరు
తిరుపతి
మదనపల్లి
రాజంపేట