జనసేనకు 30 అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లు...కన్ ఫర్మ్...?

మొత్తానికి చాలా స్మూత్ గా సజావుగానే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించిన సీట్ల పంపకాలు పూర్తి అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Update: 2023-11-30 11:42 GMT

మొత్తానికి చాలా స్మూత్ గా సజావుగానే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించిన సీట్ల పంపకాలు పూర్తి అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేనకు మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ 30 సీట్లను ఇవ్వనుంది అని అంటున్నారు. అలాగే పాతిక దాకా ఉన్న ఎంపీ సీట్లలో రెండు సీట్లను ఇస్తారని తెలుస్తోంది

అంటే మొత్తం అసెంబ్లీ సీట్లలో ఆరవ వంతు అన్న మాట. అలాగే మొత్తం ఎంపీ సీట్లలో పన్నెండవ వంతు అన్న మాట. ఈ మేరకు అంగీకారం కుదిరించి అని వార్తలు అయితే పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. ఈ మేరకు గత కొన్ని రోజులుగా జనసేన టీడీపీ నేతలు ఇద్దరూ పలు మార్లు చర్చించిన మీదట ఈ విధంగా ఒక అంగీకారానికి సూత్రప్రాయంగా వచ్చినట్లుగా చెబుతున్నారు.

దీని వల్ల ఏపీలో టీడీపీ 145 అసెంబ్లీ సీట్లలో అలాగే 23 ఎంపీ సీట్లలో పోటీ చేస్తుంది అని అంటున్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా 88 సీట్లను సాధించేలా టీడీపీ ఎక్కువ సీట్లలోనే పోటీ పడుతుంది అని అంటున్నారు.

అయితే ఈ సీట్ల విషయం కూడా మొదట అంత సులువుగా తెగలేదు అని అంటున్నారు. ఏపీలో ఉన్న పాతిక లోక్ సభ సీట్లను ప్రాతిపదికగా తీసుకుని ఒక్కో ఎంపీ స్థానంలో ఒక్కో అసెంబ్లీ సీటు వంతున పాతిక దాకా ఇస్తామని టీడీపీ జనసేనకు పాతిక సీట్లను ప్రతిపాదించింది అని అంటున్నారు.

అయితే జనసేన దానికి ఏ మాత్రం అంగీకరించలేదని, ఒక్కో ఎంపీ సీటులో రెండు సీట్లు వంతున మొత్తం ఏపీవ్యాప్తంగా యాభై సీట్లు జనసేనకు ఇవాలని డిమాండ్ చేసినట్లుగా తెలిసింది. ఆ మీదట సీరియస్ గా సాగిన చర్చల పర్యవశానంగా జనసేనకు 30 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ ఓకే చెప్పింది అని అంటున్నారు.

ఇది ప్రాధమికంగా కుదిరిన అవగాహన అని అంటున్నారు. ఇక ఈ వారం చివరలో అంటే శనివారం అయినా ఆదివారం అయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ కూర్చుని చర్చలు జరిపిన అనంతరం పొత్తుల వివరాలు రెండు పార్టీలు పోటీ చేసే సీట్ల సంఖ్యని ప్రకటిస్తారు అని అంటున్నారు.

అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీట్ల వివరాల మీద ప్రకటించే ముందు బీజేపీ కోసం ఆఖరి అవకాశంగా అప్పటిదాకా వేచి ఉంటారని అంటున్నారు. బీజేపీ ఈ రెండు పార్టీలతో పొత్తు కలుపుకుంటే కనుక ఆ పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది అని అంటున్నారు. అయితే బీజేపీ తెలంగాణా ఎన్నికల ఫలితాల తరువాత ఏపీ రాజకీయాల మీద పొత్తుల మీద తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అని అంటున్నారు.

అంటే బీజేపీ కూడా ఈ ఆదివారం ఫలితాల తరువాత ఏపీ విషయంలో డిసైడ్ అవుతుంది అన్న మాట. ఇదిలా ఉంటే జనసేనకు బలం ఉన్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో విశాఖలో ఎక్కువ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది అని ప్రచారం సాగుతోంది. ఆ తరువాత జిల్లాల వారీగా చూస్తే క్రిష్ణా గుంటూరు ప్రకాశం, కర్నూల్ లలో కూడా జనసేనకు కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది అని అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఈసారి పోటీ చేస్తారు అన్నది ప్రస్తుతానికి గట్టిగా వినిపిస్తున్న మాటగా ఉంది. అలాగే సేఫ్ సైడ్ గా మరో సీటుని శ్రీకాకుళం నుంచి కానీ తిరుపతి నుంచి కానీ పవన్ పోటీ చేస్తారు అని కూడా వినిపిస్తోంది.

ఇక లోక్ సభ సీట్ల విషయానికి వస్తే కాకినాడ సీటుతో పాటు నెల్లూరు లేదా కర్నూల్ సీటుని జనసేనకు ఇస్తారని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద చూస్తే జనసేనకు ముప్పయి అసెంబ్లీ సీటు పొత్తులో దక్కనున్నాయని టాక్ అయితే నడుస్తోంది. ఇదే నిజం అయితే ఈ కూటమిలో పెద్ద పార్టీగా పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ ని సాధించి అధికారంలోకి వచ్చే పార్టీగా టీడీపీ ఉంటుంది అని అంటున్నారు. అంటే ఈ కూటమి విజయం సాధించే ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబే సీఎం అవుతారు అని అంటున్నారు.

Tags:    

Similar News