జపాన్ కు కొత్త ప్రధాని.. నెంబర్ 102.. కీలకమైన కారణాలివే!

జపాన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ప్రధాని ఫ్యుమియో కిషిడా సంచలన నిర్ణయం తీసుకున్నారు

Update: 2024-10-02 03:37 GMT

జపాన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ప్రధాని ఫ్యుమియో కిషిడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేయడంతో పాటు కేబినెట్ మొత్తాన్ని రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. దీని వెనుక కీలక కారణాలున్నాయని అంటున్నారు. అనంతరం.. ఆయన స్థానంలో కొత్త ప్రధానిగా షిగెరు ఇబగ ఎన్నికయ్యారు.

అవును... జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతోపాటు మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ తరుపున షిగెరు ఇషిబా కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈయన జపాన్ కు 102వ ప్రధానమంత్రి!

వాస్తవానికి అక్టోబర్ 1 ఉదయం ఫ్యుమియో కిషిడా అకస్మికంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమయంలోనే తన పదవికి రాజీనామా చేస్తూ.. కేబినెట్ ను రద్దు చేసినట్లు ప్రకటించారు. దీనికి పలు బలమైన కారణాలున్నాయని అంటున్నారు. ఇందులో ఒకటి అవినీతి కాగా మరొకటి అసమర్ధత అని చెబుతున్నారు.

2021 నవంబర్ 1న జపాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కిషిడా.. తన రెండున్నర సంవత్సరాల పాలనలో అనేక కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా లభించినట్లు కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారనే చర్చ నడుస్తుంది.

అది ఒక కారణం అయితే... సుదీర్ఘకాలంగా సాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సరైన నిర్ణయాలన్ను తీసుకోలేకపోవడం.. ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండటం, మధ్య ఆసియాలో జపాన్ ను శక్తివంతమైన దేశంగా నిలబెట్టలేకపోవడం, నిరుద్యోగం వంటి విషయాల్లో కిషిడా చురుగ్గా వ్యవహరించలేకపోయారని చెబుతున్నారు.

దీంతో... లిబరల్ డెమోక్రటిక్ పార్తీ కొత్త ప్రధాని అభ్యర్థిని ఎన్నుకొంది. ఇదే సమయంలో కొత్త మంత్రివర్గ ఏర్పాటుకూ సన్నాహాలు మొదలయ్యాయని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన షిగేరు ఇబగ... దేశ భద్రతను పటిష్టం చేయడమే తన లక్ష్యమని అన్నారు.

Tags:    

Similar News