భవిష్యత్తులో అందరికీ ఒకే ఇంటిపేరు... తాజా అధ్యయనంలో కీలక విషయాలు!

అవును... వివాహం చేసుకొన్న జంటలు వేరువేరు ఇంటి పేర్లను ఉంచుకునే హక్కును ఇవ్వకపోతే... 2531 నాటికి జపాన్ లో అందరికీ ఒకే ఇంటి పేరు ఉంటుందని

Update: 2024-04-05 11:30 GMT

తాజాగా జపాన్ లోని ఒక అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇందులో భాగంగా ఫ్యూచర్ లో దేశంలో అందరికీ ఒకే ఇంటిపేరు ఉంటుందని తెలిపింది. అందుకు ఆ అధ్యయనం చెప్పిన రీజన్ ఏమిటి.. అందుకు సహకరించే అంశాలేమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

తొహొకు విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ హిరోషి యషోహిడా నేతృత్వంలోని ఒక అధ్యయనం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ప్రస్తుతం అమౌలో ఉన్న కఠినతర చట్టాలు కొనసాగితే.. భవిష్యత్తులో జపాన్ లో అందరికీ ఒకే ఇంటిపేరు వస్తుందని ఆ అధ్యయనం తెలిపింది. అందుకు కారణం... జపాన్ లో 18వ శతాబ్ధంలో చేసిన సివిల్ కోడ్ చట్టం ప్రకారం దంపతులు ఇద్దరూ ఒకే ఇంటిపేరు కలిగి ఉండటమే అని చెబుతుంది.

అవును... వివాహం చేసుకొన్న జంటలు వేరువేరు ఇంటి పేర్లను ఉంచుకునే హక్కును ఇవ్వకపోతే... 2531 నాటికి జపాన్ లో అందరికీ ఒకే ఇంటి పేరు ఉంటుందని.. ఇందులో భాగంగా వారందరి పేర్ల చివర "సాటో" అనేదే మిగులుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. మరోవైపు ఇప్పటికే ఆ దేశంలో దంపతులు వేరువేరు ఇంటిపేర్లను పెట్టుకునే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాలనే డిమాండ్లు మొదలయ్యాయి.

ఇదే క్రమంలో... ప్రస్తూతం జపాన్ లో పెళ్లిళ్ల రేటు గణనీయంగా తగ్గిందని.. గత ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గుదల కనిపించీందని.. మరోపక్క విడాకుల రేటు మాత్రం 2.6 శాతం పెరిగిందని.. ఈ పరిస్థితి మారితేనే తమ అంచనాలు నిజమవుతాయని.. లేకపోతే వాటిలో మరికొన్ని తేడాలు రావొచ్చని హిరోషి యషోహిడా అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం జపాన్‌ లో పెళ్లిళ్ల రేటు గణనీయంగా తగ్గింది. 2023లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే వివాహాల్లో 6 శాతం తగ్గుదల కనిపించింది. దాదాపు 12 కోట్లకుపైగా జనాభా ఉన్న దేశంలో 5,00,000 కంటే తక్కువ పెళ్లిళ్లు జరిగాయి. గత 90 ఏళ్లలో ఇదే అత్యల్పం. విడాకుల రేటు మాత్రం ఇదే సమయంలో 2.6 శాతం పెరిగింది. ఈ పరిస్థితి మారితేనే తన అంచనాలు నిజమవుతాయని.. లేకపోతే వాటిల్లో తేడా రావొచ్చని హిరోషి అభిప్రాయపడ్డారు.

కాగా... జపాన్ దేశంలో సుమారు 3,00,000 ఇంటి పేర్లు ఉండగా... అందులో "సాటో" అనే ఇంటిపేరు అత్యధికంగా 18,00,000 మంది పేర్ల పక్కన కనిపిస్తుంటుంది! ఇక ఆ తర్వాతి స్థానల్లో తకాహోషి, సుజుకీ అనే ఇంటి పేర్లు ఉన్నాయి.

Tags:    

Similar News