క్రికెట్ పోస్ట్ విషయంలో జేసీ ఫ్యామిలీకి బాబు నుంచి గుడ్ న్యూస్!
ఇదే సమయంలో... జేసీ పవన్ రెడ్డికి ఇంటర్నేషనల్ క్రికెటర్లతో మంచి స్నేహం ఉందనేది తెలిసిన విషయమే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేసేవి!
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) లో మొత్తం వైసీపీ రాజ్యసభ ఎంపీ వియసాయిరెడ్డి కి సంబంధించిన వారే ఉన్నారనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఏసీఏ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యలోనే జేసీ ఫ్యామిలీ మెంబర్ పేరు తెరపైకి వస్తుందని తెలుస్తోంది.
అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో సమస్యలుగా ఉన్న పలు విషయాల్లో ప్రక్షాళన చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే... ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిని మార్చనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పోస్ట్ కోసం జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు!
వాస్తవానికి కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఏసీఏ కార్యవర్గం మొత్తం రాజీనామా చేశారు! దీంతో... ఈ నెల నాలుగో తేదీన జరగబోయే సమావేశంలో వీరందరి రాజీనామాలూ ఆమోదించి.. అనంతరం వెంటనే నూతన కార్యవర్గం కోసం చర్యలు ప్రారంభించనున్నారని తెలుస్తోంది. దీంతో... ఏసీఏ అధ్యక్షుడిగా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నప్పటికీ... జేసీ పవన్ రెడ్డే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు!
ఇదే సమయంలో... జేసీ పవన్ రెడ్డికి ఇంటర్నేషనల్ క్రికెటర్లతో మంచి స్నేహం ఉందనేది తెలిసిన విషయమే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేసేవి! అందులో మహేంద్ర సింగ్ ధోనీతోనూ పవన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటారు. ఇదే సమయంలో క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ పైనా ఆయనకు అవగాహన ఉందని చెబుతుంటారు.
అయితే... ఈ విషయంలో జేసీ పవన్ రెడ్డికి మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు కూడా కూటమి ప్రభుత్వంలోని పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చర్చ తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో... జేసీ పవన్ మాత్రం సీరియస్ గా ప్రయత్నిస్తే ఆయన పేరే ఖరారయ్యే అవకాశలు పుష్కలంగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... 2019 ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసిన జేసీ పవన్ రెడ్డి.. వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యపై 1,41,428 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇక, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మరోసారి అనంతపురం లోక్ సభ స్థానానికి పోటీ చేసే అవకాశాలున్నట్లు కథనాలొచ్చినా.. చివరి నిమిషంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా అంబికా జీ లక్ష్మీనారాయణకు వెళ్లింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా జేసీ పవన్ రెడ్డికి మంచి అకామిడేషన్ చూపించాలని ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతుంది! ఈ నేపథ్యంలోనే ఏసీఏ అధ్యక్షుడిగా పవన్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది!