సీబీఐ జేడీ విశాఖ నుంచి కాదా...అక్కడ ల్యాండ్ అయ్యారా...?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నుంచి ఎంపీగా మళ్లీ పోటీ చేస్తాను అని ఇటీవల కాలం దాకా స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు.

Update: 2023-08-14 01:30 GMT

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నుంచి ఎంపీగా మళ్లీ పోటీ చేస్తాను అని ఇటీవల కాలం దాకా స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు. ఆయన 2019లో జనసేన తరఫున పోటీ చేసి ఏకంగా రెండు లక్షల ఎనభై వేల ఓట్ల పై చిలుకు తెచ్చుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఓడి గెలిచారు అని అంటారు. కేవలం వారం పది రోజుల వ్యవధిలో ఆయన ఈ ఫీట్ సాధించారు.

దాంతో జేడీ 2024లో కూడా విశాఖ నుంచే పోటీ అంటూ వచ్చారు. కానీ ఆయన ఇపుడు రూట్ మార్చేశారా అన్న డౌట్లు వస్తున్నాయి. విశాఖ నుంచి కాకుండా ఆయన తాను పుట్టిన రాయలసీమ జిల్లాల వైపు నుంచే చూస్తున్నారు అని అంటున్నారు. అక్కడే ఒక సేఫ్ సీటు ని చూసుకుని అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారా అన్న చర్చ మొదలైంది.

దానికి కారణం జేడీ ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించారు. పలమనేరు పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాలలో ఆయన పాలు పంచుకున్నారు. ఇక కాపు సామాజికవర్గం నేతలు స్థానిక పెద్దలు ఆయన్ని ఘనంగా సత్కరించారు. పలమేఅరులో పలు ప్రారంభోత్సవాలలో జేడీ పాల్గొన్నారు. అక్కడ ఉన్న శ్రీక్రిష్ణ దేవరాయల విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు.

రాష్ట్రలో సీమ జిల్లాలలో పట్టు పరిశ్రమ మీద ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు అని జేడీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వారికి అండగా ఉంటామని అంటున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను సత్కరించడం విశేషం. ఆ పార్టీ రాష్ట్ర నేత ఆకుల గజేంద్ర అయితే మా కాపుల ముద్దుబిడ్డ జేడీ అని కొనియాడారు. సీబీఐ వృత్తిలో జేడీ ఎంతో నిబద్ధతతో సేవ చేశారు అని ఆయన పొగిడారు.

జేడీ విశాఖ నుంచి కాకుండా పలమనేరు నుంచి పోటీ చేస్తారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన తన సొంత ప్రాంతం అయిన సీమ నుంచే రాజకీయంగా చురుకుగా పాత్ర పోషించడం ద్వారా అసెంబ్లీకి ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఇటీవల కాలంలో విశాఖలో జేడీ సందడి కనిపించడంలేదు. మరి ఆయన కోరుకున్న పార్టీ ఏది, ఆయన కోరుకున్న సీటు ఏది అన్నది తొందరలోనే వెల్లడి అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News