పిఠాపురంలో పవన్ గెలుపుపై మాజీ జేడీ తాజా విశ్లేషణ!

అవును... ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎంత హాట్ టాపిక్ గా మారింది అనేది తెలిసిన విషయమే.

Update: 2024-05-28 07:36 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ప్రస్తుతం అందరి దృష్టీ జూన్ 4 న వెలువడబోతోన్న ఫలితాలపైనే ఉందనేది తెలిసిన విషయమే. ఈ గ్యాప్ లో పలురకాల విశ్లేషణలు, అంచనాలు, అభిప్రాయాలు, ఎగ్జిట్ పోల్ అనాలసిస్ లు మొదలైనవి ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో పిఠాపురంలో పవన్ గెలుపుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికరంగా స్పందించారు.

అవును... ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎంత హాట్ టాపిక్ గా మారింది అనేది తెలిసిన విషయమే. ఆ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడం.. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆఖరి మీటింగ్ ను పిఠాపురంలో నిర్వహించిన జగన్.. వైసీపీ అభ్యర్థి వంగ గీతను గెలిపిస్తే ఉపముఖ్యమంత్రిని చేసి పక్కన కుర్చోబెట్టుకుంటానని ప్రకటించారు.

దీంతో... పిఠాపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అప్పటివరకూ పవన్ కు కాస్త ఎడ్జ్ ఉందంటూ వినిపించిన మాటల నడుమ... ఫైట్ టైట్ అయ్యిందనే కామెంట్లూ తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఎవరు గెలుస్తారనే విషయంపై తీవ్ర చర్చ నడిచింది. ఈ సమయంలో పిఠాపురంలో పవన్ గెలుపును కన్ ఫాం చేసేశారు జై భారత్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ!

తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిఠాపురంలో పరిస్థితిపై స్పందించిన ఆయన... అక్కడ పవన్ గెలుపు ఆల్ మోస్ట్ కన్ ఫాం అని.. మెజారిటీ ఎంతనే విషయంపైనే చర్చ, బెట్టింగులు నడుస్తున్నాయన్నట్లుగా స్పందించారు. పైగా.. ఏపీలో కూటమి జతకట్టడానికి కారణం తానే అని చెప్పుకున్న పవన్... రేపు కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే ఏపీ ప్రయోజననలా విషయంలో ఆయన భూమిక కీలకం అని అన్నారు.

ఇదే క్రమంలో... ప్రజల సమస్యలపై పవన్ స్పందించే విషయం కాని.. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే విషయం ఆయన ధోరణి కానీ.. అలాంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉందని తెలిపిన వీవీ... ఫలితంగా రాష్ట్రం ముందుకు వెళ్తుందని అన్నారు. ఫలితంగా పిఠాపురంలో పవన్ గెలుస్తారనే తాను అనుకుంటున్నట్లు వీవీ లక్ష్మీనారాయణ విశ్లేషించారు.

కాగా... వీవీ లక్ష్మీనారాయణ గతంలో జనసేన పార్టీలో ఉండి ఈ పార్టీ టికెట్‌ పై వైజాగ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన పార్టీని విడిచిపెట్టారు. జై భారత్ పార్టీని స్థాపించి 2024 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు. 2019లో జేఎస్పీ నుంచి విడిపోయిన తర్వాత పవన్‌ కు నాయకత్వ లక్షణాలు లేవన్నట్లుగా పలికిన ఆయన.. పిఠాపురంలో గెలుపుపై ధీమాగా చెప్పడం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News