జగన్ తో జోగి...మ్యాటర్ క్లియర్ ?

మరి జగన్ కి ఆయన ఏమి చెప్పారో తెలియదు కానీ కేవలం గౌడ సంఘం మీటింగ్ కాబట్టే వెళ్లానను వివరించి ఉంటారని అంటున్నారు.

Update: 2024-12-19 13:40 GMT

వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత జోగి రమేష్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఏమి చర్చించారు అన్నది రాజకీయాల మీద కాస్తా అవగాహన ఉన్న వారికి అర్ధమయ్యే విషయమే. నాలుగు రోజుల క్రితం విజయవాడలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహా విష్కరణ ఉత్సవాలలో జోగి రమేష్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి టీడీపీకి చెందిన వారే పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైసీపీకి చెందిన జోగి రమేష్ ఒక్కరే హాజరు అయ్యారు. దాంతో ఆయన మీద వైసీపీ టీడీపీ రెండింటిలో రాజకీయ రచ్చ చెలరేగింది. వైసీపీని వీడి జోగి రమేష్ టీడీపీలో చేరిపోతున్నారు అన్న టాక్ పెద్ద ఎత్తున వ్యాపించింది.

అయితే ఆశ్చర్యకరంగా జోగి రమేష్ తో రాసుకుని పూసుకుని తిరిగిన టీడీపీ మంత్రి ఎమ్మెల్యేలు ఇతర నేతల మీద ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. వారి నుంచి వివరణ కోరింది. ఇంకో వైపు వైసీపీ కూడా ఈ విషయం మీద జోగి రమేష్ మీద ఆగ్రహంగా ఉందని వార్తలు వచ్చాయి.

అయితే వైసీపీ నుంచి జోగి రమేష్ ని వివరణ కోరినట్లుగా ప్రచారం అయితే అధికారికంగా లేదని భావిస్తున్న నేపధ్యంలో జోగి రమేష్ జగన్ ని నేరుగా కలిసారు. మరి జగన్ కి ఆయన ఏమి చెప్పారో తెలియదు కానీ కేవలం గౌడ సంఘం మీటింగ్ కాబట్టే వెళ్లానను వివరించి ఉంటారని అంటున్నారు.

అయితే జోగి రమేష్ గత ఆరు నెలలుగా వైసీపీలో యాక్టివ్ గా అయితే లేరు అన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాటగా ఉంది. అంతే కాదు ఆయనకు ఇష్టమైన మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ అధినాయకత్వం ఇంచార్జి బాధ్యతలు అప్పగించినా పార్టీ కార్యకలాపాలు అయితే అక్కడ మొదలుకాలేదని కూడా అంటున్నారు.

ఇంకో వైపు జోగి రమేష్ పార్టీ మారుతారు అన్నది చాలా కాలంగా వినిపిస్తున్న మాటగా ఉంది. ఈ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ ర్యాలీలో కనిపించడం అంటే కచ్చితంగా వైసీపీ అధినాయకత్వం అనుమానిస్తుంది అని అంటున్నారు.

మరీ ముఖ్యంగా జగన్ ఆయనకు ఎంతో ప్రయారిటీ ఇచ్చారని అంటున్నారు. పదే పదే పార్టీ టికెట్లు ఇవ్వడమే కాకుండా ఏకంగా కీలక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా చేశారు అని గుర్తు చేస్తున్నారు. ఇంత చేసినా జోగి రమేష్ అయితే పార్టీకి హ్యాండ్ ఇచ్చేలా వ్యవహరించారా అన్న చర్చ అయితే సాగుతోంది.

వైసీపీ నుంచి ఏ ఒక్క నేతా వెళ్లదని దానికి జోగి రమేష్ వెళ్ళడం బట్టి చూస్తూంటే ఆయన ఆలోచనలు వేరేగా ఉన్నాయనే అనుమానిస్తున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ జోగి రమేష్ విషయంలో సీరియస్ గా ఉండడంతో పాటు చేర్చుకునే ఉద్దేశ్యం లేదని సంకేతాలు ఇవ్వడంతోనే ఆయన వైసీపీలోనే ఉండాలని అనుకుంటున్నారా అన్న చర్చ కూడా చేస్తున్న వారు ఉన్నారు.

ఏది ఏమైనా జోగి రమేష్ ఇచ్చిన వివరణకు జగన్ సంతృప్తి చెందుతారా అన్నది కూడా కీలకమైన పాయింట్. ఒక వేళ ఆయన చెందితే రానున్న రోజులలో పార్టీలో జోగి రమేష్ ప్రాధాన్యత అలాగే ఉంటుంది. లేకపోతే వేరేగా ఉంటుంది అంటున్నారు. ఏది ఏమైనా జోగి రమేష్ వ్యవహారం మీద వైసీపీ హైకమాండ్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నది ముందు ముందు యాక్షన్ ద్వారానే తెలుస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News