చంద్ర మామకు అల్లుడు జూనియర్ థాంక్స్

ఇక తన దేవర సినిమాకు టికెట్లు పెంచుకోవడానికి అనుమతించి ఇచ్చినందుకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కూడా థాంక్స్ చెప్పారు.

Update: 2024-09-22 03:55 GMT

నందమూరి వారి మూడవ తరం, సాక్షాత్తూ సీనియర్ ఎన్టీఆర్ కి ముద్దుల మనవడు. తాత గారి సినీ లెగసీని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటుతున్న నేటి మేటి నట శిఖరం జూనియర్ ఎన్టీఆర్. మామ నారా చంద్రబాబు నాయుడుకు థాంక్స్ అని చెప్పారు. ఇది సీఎం కి ఒక ప్రముఖ సినీ నటుడు చెప్పిన ధన్యవాదాలు గా చూడవచ్చు.

కానీ ఇది కాదు మ్యాటర్. జూనియర్ దాదాపు పుష్కర కాలం నుంచి చంద్రబాబుకు దూరం పాటిస్తున్నారు అని ప్రచారంలో ఉంది. 2014, 2019, 2024 ఎన్నికల్లో టీడీపీకి ఆయన ప్రచారం చేయలేదు. ఆ మాటకు వస్తే 2011లో హైదరాబాద్ లో జరిగిన మహానాడులో జూనియర్ చివరి సారిగా కనిపించారు. ఆ విధంగా చూస్తే రాజకీయంగా గ్యాప్ తో కుటుంబ పరంగా కూడా ఎడం పాటిస్తున్నారు అని ప్రచారం పీక్స్ లో సాగింది.

హైదరాబాద్ లో గత ఏడాది సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తే జూనియర్ హాజరు కాలేదు. అంతే కాదు ఇటీవల బాలయ్య యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం మీద జరిగిన ఈవెంట్ కి డుమ్మా కొట్టారు. బాబు అరెస్ట్ అయితే జైలుకు వెళ్తే ఒక్క ట్వీట్ కూడా చేయలేదు అన్న విమర్శలూ ఉన్నాయి.

అయితే వీటిని అన్నింటినీ పటాపంచలు చేస్తూ జూనియర్ థాంక్స్ అన్న రెండు అక్షరాలతో కొత్త ఆలోచనలు రేకెత్తించారు అని అంటున్నారు. దీని కంటే ముందు ఆయన ఏపీకి తుఫాను బాధితుల సహాయం కోసం భారీ విరాళం ప్రకటించారు.

ఇక తన దేవర సినిమాకు టికెట్లు పెంచుకోవడానికి అనుమతించి ఇచ్చినందుకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కూడా థాంక్స్ చెప్పారు. ఇది పెద్ద విషయం కాదని అనుకోవచ్చు. కానీ రాజకీయంగా ఆలోచిస్తే మాత్రం కీలకమైనదే అంటున్నారు.

ఏపీలో టీడీపీ 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ విజయం తో మరో రెండు దశాబ్దాల పాటు టీడీపీ అప్రతిహతంగా దూసుకుపోయే శక్తిని కూడా సంపాదించుకుంది. టీడీపీలో చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ బాగానే రాణిస్తున్నారు. ఆయన అన్ని రకాలుగా రాటుతేలారు.

ఏ అడ్డంకీ లేకపోతే 2029లో టీడీపీ మళ్ళీ బ్రహ్మాండంగా గెలిచే వీలుంది. అలా నారా లోకేష్ సీఎం అయ్యే చాన్స్ ఉంది. టీడీపీలో లోకేష్ హవా ప్రస్తుతం సాగుతోంది. మరో వైపు చూస్తే జూనియర్ సినీ రంగంలో పవర్ ఫుల్ ప్లేస్ లో ఉన్నారు

ఆయనకు రాజకీయాలు ఇప్పట్లో వద్దు అని అనుకున్నారు కానీ ఫ్యూచర్ లో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే సినీ నటుడిగా ఆయనకు ప్రభుత్వాలతో పని ఉంది. అంతే కాదు గతంలో ఎలా ఉన్నా టీడీపీ పవర్ లో ఉంది. నారా ఫ్యామిలీ పొలిటికల్ గా పవర్ ఫుల్ గా ఉంది.

సమీప భవిష్యత్తులో కూడా ఈ పవర్ ఏమీ తగ్గేది లేదు సరికదా ఇంకా వెలిగే చాన్స్ ఉంది. ఇలా ఎన్నో చూసుకుంటే జూనియర్ నారా ప్లస్ నందమూరి ఫ్యామిలీలో ఒకడుగా కలసి మెలసి ఉండడమే మేలు అన్నది అభిమానుల మాట. ఇక జూనియర్ కి కూడా వేరేగా ఉన్నారు అన్న వార్తలు పుకార్లుగానే ఉన్నాయని అంటున్నారు.

ఆయన అవకాశం సందర్భం వచ్చినపుడు కలవాలని అనుకుంటున్నారు అని ఆ వైపు నుంచి వస్తున్న మాట. సో ఇప్పటికి ఈ విధంగా దేవర సినిమా సాక్షిగా థాంక్స్ చంద్రమామ దాకా వచ్చారు. ముందు ముందు మామా అల్లుళ్ళ మధ్య మంచి బంధమే గట్టి పడే చాన్స్ ఉంది.

ఇక టీడీపీలో నారా లోకేష్ ప్లేస్ బలంగా ఉంది. ఆ ప్లేస్ లోకి ఎవరు వచ్చినా కూడా పోటీ ఉండలేనంతగా లోకేష్ ఎదిగిపోయారు. సో ఏ రకమైన బెంగలూ కలవరాలు గతంలో మదిరిగా ఇపుడు నారా వారి పెద్దలలో లేవు అని అంటున్నారు. దాంతో జూనియర్ కూడా కలసి వచ్చి సందడి చేస్తే హ్యాపీగా ఆక్సెప్ట్ చేసే వాతావరణమే ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే సాధ్యమైనంత తొందరలోనే నారా నందమూరి ఫ్యామిలీస్ తో జూనియర్ గ్రూప్ ఫోటో కనిపిస్తుందని అలా కనిపించాలని కూడా శ్రేయోభిలాషులు అంతా కోరుకుంటున్నారుట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News