జూనియర్ పాలిటికల్ ఎంట్రీ మీద లొకేష్ సంచలన కామెంట్స్...!
ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లుగా సైలెంట్ అయిపోయారు. దీని మీద అనేక రకాలైన విమర్శలు నాడు సోషల్ మీడియాలో వచ్చాయి
నందమూరి వంశంలో మూడవ తరం వారసుడు జూనియర్ ఎన్టీఆర్. . తాత సీనియర్ ఎన్టీఆర్ పేరుని నిలబెడుతూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సాధించిన జూనియర్ ఈ రోజున గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎంత బిజీ అంటే తన మామ చంద్రబాబు అరెస్ట్ అయినా కూడా రియాక్ట్ అవనంతగా.
ఇదే విషయం అప్పట్లో చర్చకు వచ్చింది. ఇపుడూ వస్తోంది. నందమూరి ఫ్యామిలీ ఆ వైపు నుంచి ఈ వైపుగా ఉన్న నాలుగైదు తరాలు బాబు అరెస్ట్ మీద గట్టిగా రియాక్ట్ కావడమే కాదు అవసరం అయినపుడు అంతా ఒక్కటిగా కలసి కదలి వచ్చాయి. అయితే ప్రముఖ నటుడిగా ఫుల్ గ్లామర్ ఉన్న జూనియర్ మాత్రం బాబు అరెస్ట్ మీద ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.
ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లుగా సైలెంట్ అయిపోయారు. దీని మీద అనేక రకాలైన విమర్శలు నాడు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే ఇదే విషయం మీద టీడీపీ పెద్దలు ఎవరూ స్పందించలేదు. ఆ మధ్యన బాలక్రిష్ణను హైదరాబాద్ లో మీడియా ప్రశ్నించినపుడు ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా డోంట్ కేర్ అని తనదైన స్టైల్ లో చెప్పేశారు.
ఇపుడు చూస్తే ఆ ప్రశ్న నారా లోకేష్ కి ఎదురైంది. ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ఇదే ప్రశ్నను సంధించారు. దానికి నారా లోకేష్ ఇచ్చిన జవాబు ఏంటి అంటే అది జూనియర్ ఇష్టం అని. ఇది పూర్తిగా జూనియర్ పర్సనల్ ఒపీనియన్ అని లోకేష్ చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు కష్టకాలంలో అండగా నిలబడాలా వద్దా అన్నది ఆయనకే వదిలేస్తాను అని అన్నారు.
దాని మీద నేను మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు అని లోకేష్ అంటున్నారు. అదే టైంలో రాజకీయాల్లోకి జూనియర్ రాకుండా ఎవరూ అడ్డుకోలేరు అని ఆయన అనడం ఇంటరెస్టింగ్ పాయింట్ గా ఉంది. సమాజానికి సేవ చేయాలని ఎవరికి ఉన్నా వారు రాజకీయాల్లోకి రావచ్చు అన్నారు. జూనియర్ ని లోకేష్ కాదు కదా ఎవరూ అడ్డుకోలేరు అని సంచలన కామెంట్స్ చేశారు.
తాను రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాను అని లోకేష్ చెప్పారు. తాను మూడు వేల పై చిలుకు పాదయాత్ర చేశానని, మొత్తం 90 కి పైగా నియోజకవర్గాలలో తిరిగానని 226 రోజుల పాటు తాను జనంలో ఉన్నాను అని లోకేష్ చెప్పుకున్నారు. తనకు రాజకీయాలు అంటే చాలా ఇష్టమని అందుకే తాను వచ్చాను అని లోకేష్ అన్నారు. మరి జూనియర్ విషయంలో అయితే లోకేష్ ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారా అన్న చర్చ నడుస్తోంది.
జూనియర్ కి రాజకీయాల మీద ఆసక్తి ఉంటే రావచ్చు అన్నది ఆయన మాటగా ఉంది. అదే టైం లో తాను ప్రజల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేశాను అని చెప్పుకోవడం ద్వారా సమాజం పట్ల తన చిత్తశుద్ధిని ఆయన చాటుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి జూనియర్ రాజకీయాల మీద చినబాబు తమాషాగానే రియాక్ట్ అయ్యారు అని అంటున్నారు.