సీఎం స్లోగన్స్ మీద జూనియర్ రియాక్షన్ వైరల్ !
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ సభలలో కూడా సీఎం నినాదాలు ఇస్తూంటారు.
సీఎం అని జూనియర్ ఎన్టీఆర్ ని అభిమానులు పిలుస్తూనే ఉంటారు. వారి దృష్టిలో జూనియర్ ఏనాటికి అయినా సీఎం అవుతారు అన్న బలమైన అభిప్రాయం ఉంది. తాత ఎన్టీఆర్ కి అసలైన వారసుడు జూనియర్ అని ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆనాటి పొలిటికల్ సునామీ మళ్లీ రిపీట్ అవుతుందన్నది వారి దృఢ విశ్వాసం.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ సభలలో కూడా సీఎం నినాదాలు ఇస్తూంటారు. అది పరిపాటిగా మారిపోయింది. ఇదిలా ఉంటే సీనియర్ ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చిన జూనియర్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
అయితే అక్కడకు వచ్చిన జూనియర్ ని చూసిన ఫ్యాన్స్ దేవరా అని పిలవలేదు. ఎందుకంటే ఆయన లేటెస్ట్ మూవీ అదే. కానీ అదే సమయంలో సీఎం అంటూ అదే పనిగా స్లోగన్స్ చేశారు. ఏపీలో చూస్తే ఎన్నికలు అయిపోయాయి. మళ్ళీ 2029లోనే ఎన్నికలుజరుగుతాయి. దానికి గట్టిగా అయిదేళ్ళు బిగిసి ఉంది.
పైగా జూనియర్ రాజకీయాల వైపు తొంగి చూడటం లేదు. ఆయన ఎపుడో 2009లో తప్ప ఎన్నికల ప్రచారం చేసింది లేదు. ఆయన పూర్తిగా సినిమాలకే అంకితం అయిపోయారు. తన కెరీర్ ని పరుగులు పెట్టిస్తున్నారు. కానీ సీఎం అంటూ ఫ్యాన్స్ బిగ్గరగా సౌండ్స్ చేస్తూ హోరెత్తించారు. అయినా ఎక్కడా జూనియర్ కనీసంగా స్పందించలేదు.
తాతకు నివాళి అర్పించారు. ఆ తరువాత తన కోసం వేచి చూస్తున్న మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆయన తాత పట్ల తన భక్తిని చాటుకునేందుకు మాత్రమే వచ్చారు. తన పని ఏంటో తాను ఏంటో అన్నట్లుగానే ఉన్నారు.
అంతే తప్ప ఎన్టీఆర్ సీఎం అంటూ అభిమానులు ఎంత గోల పెట్టినా కనీసంగా రియాక్ట్ కాలేదు. దీనిని చూసిన వారు జూనియర్ కి ఉన్న స్థిర చిత్తాన్ని స్థిత ప్రజ్ఞతను మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఏ వేళలో ఎలా ఉండాలో సందర్భ శుద్ధి కూడా ఆయనకు ఉన్నంతగా ఎవరికీ లేదు అని అంటున్నారు.
ఇక మీడియాతో ఇంటరాక్ట్ అయితే వారు ఏవేవో అడిగిన వాటిని జవాబు చెప్పాలి. అందులో వివాదాలు అయితే ఇబ్బంది. అందుకే ఆయన తాను అనుకున్నట్లుగా తాతకు నివాళి అర్పించి వెళ్ళిపోయారు. మరి సీఎం అన్న మాటలు చెవిన పడినా జూనియర్ రియాక్ట్ కాకపోవడమే ఇపుడు వైరల్ అవుతోంది.
జూనియర్ కి రాజకీయాలు ఇపుడు ఇష్టం లేదా అసలు ఇష్టం లేదా అంటే ఆయన సరైన టైం లోనే రియాక్ట్ అవుతారు అని అంటున్నారు. ఆయన సినీ రంగంలో మధ్యాహ్న మార్తాండుడు మాదిరిగా ఉన్నారు. దాంతో ఆయన తన సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతారని అందుకే నో పాలిటిక్స్ అని అంటున్నారని విశ్లేషిస్తున్నారు.
ఇక పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే జూనియర్ కి తగినంత స్పేస్ ఉంది. అది ఫ్యూచర్ లో ఇంకా బాగా పెరుగుతుంది. దాంతో ఆయనలో ఎలాంటి కంగారూ కలవరం లేదు అని అంటున్నారు. అంతా ఒక సిస్టం ప్రకారమే చేసుకుంటూ జూనియర్ వెళ్తున్నారు అని అంటున్నారు. అందువల్ల సీఎం అని ఫ్యాన్స్ స్లోగన్స్ వినిపించినా జూనియర్ మనసు చెదిరే ప్రసక్తి లేదు అని అంటున్నారు.
అయితే అభిమానులు మాత్రమే కాదు రాజకీయ విశ్లేషకులు సైతం ఒక్కటి బలంగా నమ్ముతున్నారు. జూనియర్ సీఎం మెటీరియల్ అని ఒప్పుకుంటున్నారు. ఏనాటికి అయినా ఆయన ముఖ్యమంత్రి అవుతారు అన్నది అత్యధికుల భావన కూడా. ఆ రోజు వరకూ వెయిట్ చేసే వారు చేస్తారు. చేయని వారు సీఎం నినాదాలు ఇస్తూనే ఉంటారు. బట్ జూనియర్ నుంచి మాత్రం ఇలాగే రెస్పాన్స్ ఉంటుంది అంటున్నారు.