కడప కార్పొరేషన్ లో రగడ.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిల్చొని నిరసన తెలిపారు. మరోవైపు ఆమె మాట్లాడుతుండగా మేయర్ సురేష్, కార్పొరేటర్లు అడ్డుకున్నారు.
కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాభాస జరిగింది. మేయర్ ఛాంబర్ లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారనే వ్యవహారం ఈ రసాభాసకు కారణమైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిల్చొని నిరసన తెలిపారు. మరోవైపు ఆమె మాట్లాడుతుండగా మేయర్ సురేష్, కార్పొరేటర్లు అడ్డుకున్నారు.
అవును... కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాభస జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేయడమే ప్రధాన కారణం అని అంటున్నారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతున్నప్పుడు మేయర్, కార్పొరేటర్లు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన మాధవీ రెడ్డి... ఎక్స్ అఫీషియో మెంబర్ గా మాట్లాడే అవకాశం తనకు ఉందని పట్టుబట్టారు.. ఈ సందర్భంగా.. మహిళను అవమానిస్తారా?.. అని ప్రశ్నించారు. మీరు లాగేసినా, ప్రజలు కుర్చీ ఇచ్చారని.. సమావేశమంతా నిలబడే శక్తి తనకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో గందరగోళం నెలకొంది.
మరోపక్క... ఎమ్మెల్యే మాదవీ రెడ్డి వీరంగానికి అర్ధమే లేదని.. కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఎమ్మెల్యేకి మాత్రమే అనుమతి ఉందని.. అయితే, ఆమె నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులతో సమావేశంలోకి వెళ్లారని.. ఎజెండాను విడిచి రాజకీయ ప్రసంగ చేశారని.. దీనిపై మేయర్, కార్పొరేటర్లు అభ్యంతర తెలిపారని పాలవర్గం చెబుతోంది!