కడపకు ఉక్కు లేదు...విశాఖకు దిక్కు లేదు

అటూ ఇటూ కూడ చెక్ పెట్టేసి ఏపీకి అసలు ఉక్కు అన్న మాట లేకుండా చేస్తున్నారు అని మండిపడుతున్నారు జనం.

Update: 2023-07-25 17:38 GMT

కేంద్రం తీరు ఇలాగే ఉంది. విభజన హామీలు అన్నీ తుంగ లోకి తొక్కి అందంగా మాటల కూర్పుతో అన్నీ చేసేశామని కేంద్రానికే చెల్లింది అంటున్నారు. విభజన చట్టం లో కడప కు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉంది. కానీ దీని మీద గత తొమ్మిదేళ్ళుగా ఎన్నో పిల్లి మొగ్గలు వేసిన కేంద్రం చివరికి చేతులెత్తేసింది.

కడప స్టీల్ ప్లాంట్ కి ఫీజుబిలిటీ లేదని కేంద్రం మాట మార్చేసింది. టెక్నికల్ గానే కాదు ఆర్ధికంగానూ లాభదాయకం కాదని స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. అయితే ఇంకా ఆశ పెడుతూ సాధ్యాసాధ్యాల పరిశీలన కు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొనడం విశేషం.

గనులు అందుబాటు లో లేవని, ఉన్నా నాణ్యమైనవి కావని చెబుతూ కడప స్టీల్ ప్లాంట్ కి టెంకాయ కొట్టేశారు. ఇక విశాఖ విషయానికి వస్తే దానికీ ఇదే సమస్య చెబుతున్నారు. సొంత గనులు లేవని, నష్టాలతో ఉందని చెప్పి ప్రైవేట్ దిశగా అడుగులు వేయిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ది ఆరు దశాబ్దాల చరిత్ర. ప్లాంట్ స్టార్ట్ అయి మూడున్నర దశాబ్దాలు అయింది. దానికే టిక్కు పెట్టేసి ఉక్కు లేదు మీకు అంటోంది కేంద్రం, పుట్టని కడప స్టీల్ ప్లాంట్ కి ఎన్ని అయినా మాటలు అటూ ఇటూ తిప్పవచ్చు. ఇపుడు అదే జరుగుతోంది.

దీన్ని చూస్తే ఎలా ఉంది అంటే మాస్టార్ కి నూనె లేదు, హెడ్ మాస్టర్ కి నెయ్యి లేదు అన్నట్లు, హోదాల లో తేడా తప్ప అటూ ఇటూ కూడ చెక్ పెట్టేసి ఏపీకి అసలు ఉక్కు అన్న మాట లేకుండా చేస్తున్నారు అని మండిపడుతున్నారు జనం.

Tags:    

Similar News