రూ.29 వాటర్ బాటిల్ అమ్మారని రూ.27.27 లక్షల ఫైన్

మీరు చదివింది కరెక్టే. కక్కుర్తికి పోయి రూ.20 వాటర్ బాటిల్ ను రూ.29 చొప్పున అమ్మిందో హైదరాబాద్ కు చెందిన రెస్టారెంట్.;

Update: 2025-03-05 07:54 GMT

మీరు చదివింది కరెక్టే. కక్కుర్తికి పోయి రూ.20 వాటర్ బాటిల్ ను రూ.29 చొప్పున అమ్మిందో హైదరాబాద్ కు చెందిన రెస్టారెంట్. దీనిపై సదరు వినియోగదారులు కోర్టును ఆశ్రయించటంతో సదరు హోటల్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పును ఇచ్చింది. ఇంతకూ జరిగిందేమంటే..కాకినాకు చెందిన కుసుమ కల్యాణ్ 2023 డిసెంబరులో హైదరాబాద్ కు వచ్చారు. ఆయన నగర శివారు బోడుప్పల్ లోని హోటల్ ట్యూలిప్స్ గ్రాండ్ కు వెళ్లారు.

అక్కడ బిర్యానీలు.. మూడు వాటర్ బాటిళ్లు కొనుగోలు చేవారు. ఒక్కో వాటర్ బాటిల్ కు రూ.29చొప్పున వసూలు చేశారు. రూ.20 బాటిల్ రూ.29 ఏమిటని ప్రశ్నించగా సానుకూలంగా స్పందింలేదు. దీంతో.. తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదు. దీంతో..కాకినాడ వినియోగదారుల కమిషన్ ను 2024లో ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన కాకినాడ వినియోగదారు కమిషన్ అధ్యక్షుడు రఘుపతి వసంత్ కుమార్, సభ్యులు చొక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావులు షాకింగ్ తీర్పును ఇచ్చారు. ఫిర్యాదుదారుకు హోటల్ యాజమాన్యం నష్టపరిహారంగా రూ25 వేలు ఇవ్వాలని.. ఖర్చులకు రూ.2 వేలుచెల్లించాలని పేర్కొన్నారు. చివర్లో మరో ట్విస్టు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.27 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో బాటిల్ మీద రూ.9 కక్కుర్తికి చెల్లించాల్సిన మూల్యానికి సంబంధించిన తీర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News