ద్వారంపూడి ఒక్క మగాడేనా ?
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర రెడ్డి దందాను అడ్డుకోలేకపోతున్నారు అన్న విమర్శలు అయితే గట్టిగా ఉన్నాయి.
కాకినాడ పోర్టు నుండి అక్రమ బియ్యం రవాణా అన్నది ఎక్కడా ఆగడం లేదు. అది అన్ స్టాబబుల్ గా సాగుతూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కూటమి పెద్దలు దీనినే ఫోకస్ చేస్తూ విమర్శలు చేసారు. పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ పోర్టులో అవినీతి అక్రమాల మీద ఉక్కు పాదం పెడతామని ప్రతిపక్షంలో ఉన్న వేళ అన్నారు.
తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది. అయితే కాకినాడ ఒక అక్రమ రవాణా సరుకుతో షిప్ ని సీజ్ చేశారు. ఇది ఇలాగే కొనసాగుతోంది అన్నది పవన్ తాజా టూర్ తో వెల్లడి అయింది. పవన్ సైతం దీని వెనక అతి పెద్ద ముఠా ఉందని అన్నారు. లోతైన విచారణ అవసరం అన్నారు. కేంద్ర పెద్దలకు లేఖ రాస్తామని కూడా మీడియాకు చెప్పారు.
ఇదిలా ఉంటే రేషన్ మాఫియా ఎక్కడా తగ్గడం లేదు ఆగడం లేదు అన్నది అర్ధం అవుతోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అక్రమ బియ్యం రవాణా జోరు అంతకంతకు పెరిగిపోతోంది. దీనికి అధికారులు ప్రజా ప్రతినిధులు అంతా సహకరిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి.
ఇక చెక్ పోస్టులు ఎన్ని ఉన్నా ఎంత నియంత్రణ అని చెబుతున్నా అవన్నీ జస్ట్ అలా మొక్కుబడి తంతుగా జరిగే తనిఖీలు అని అర్ధం అవుతోంది. ముఖ్యంగా పోలీసులు, రెవిన్యూ, పన్నులు, రవాణా శాఖల నుంచే సహకరాం లేకపోవడం వల్ల ఈ దందా అలా యధేచ్చగా సాగుతోంది అని అంటున్నారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర రెడ్డి దందాను అడ్డుకోలేకపోతున్నారు అన్న విమర్శలు అయితే గట్టిగా ఉన్నాయి.
ఈ రేషన్ మాఫియా గత అయిదేళ్లలో వ్యవస్థీకృతం అయింది అని అంటున్నారు. పాలకులు మారినా అధికారులు మాత్రం సహకరిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో బియ్యం అక్రమ రవాణా దందా హాపీగా సాగిపోతోంది అని అంటున్నారు.
ఏపీలో ఏటా 25.59 టన్నుల బియ్యాన్ని పేద ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. ఈ బియ్యాన్ని కిలో 11 రూపాయలు వంతున కొనుగోలు చేసి వాటిని అక్రమ దందా దారులు విదేశాలకు తరలిస్తున్నారు. అలా మొత్తం వచ్చే ఉచిత బియ్యంలో 80 శాతం ఈ విధంగా తరలిపోతోంది అని అంటున్నారు.
సరే ఈ రకంగా సాగుతున్న ప్రచారంలో ద్వారంపూడి దందా ఎంతవరకూ నిజమో కాదో తెలియదు కానీ కాకినాడ పోర్టులో ఈ రోజుకీ ద్వారంపూడి హవా అయితే ఒక్క లెక్కన సాగుతోంది అని అంటున్నారు. ఇది టీడీపీ కూటమి నేతల ఆరోపణగా ఉంది.
ముఖ్యంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వీటిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ప్రభుతం ఏపీలో కూటమిది ఉన్నా ద్వారంపూడిని అక్కడ అడ్డుకోలేకపోతున్నామని కూడా అంటున్నారు. అసలు ఇలా ఎందుకు అంటే కేవలం ద్వారంపూడి మాత్రమే కాదు టీడీపీ జనసేన అంతా కలసే ఇలా బిజినెస్ చేస్తున్నారు అని అంటున్నారు.
ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇంకా ద్వారంపూడి హవా కాకినాడ పోర్టులో నడుస్తోంది అంటే కనుక ఆలోచించాల్సిందే. అయితే ఇవన్నీ కూటమి వైపు నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వైపు నుంచి వస్తున్న ఆరోపణలుగా ఉన్నాయి.
ఇక ఇలాంటి దందాల విషయంలో డబ్బు విపరీతంగా చేతులు మారుతుంది. దాంతో డబ్బుకు అలవాటు పడిన అధికారులు సైతం వీటికి పూర్తిగా సహకరిస్తున్నారు అని అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా కూడా అది అలా జరుగుతూనే ఉంటోందని అంటున్నారు. ఈ విషయాన్ని పోర్టులో పనిచేసే ఎవరిని అడిగినా చెబుతారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే తనిఖీలు ఎంత చేసినా కూడా అవి నామమత్రం అయిపోతున్నయని అంటున్నారు. ఇక రేషన్ మాఫియా నేతలకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడితో అక్రమ రవాణా కట్టడికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీగిపోతున్నాయని అంటున్నారు. చెక్ పోస్ట్ వ్యవస్థ కూడా బలహీనంగా ఉందని ఏ విషయం అయినా ముందే తెలిసిపోతోందని అంటున్నారు. ఇక పట్టుబడినది కొంచెమే అయితే రవాణా అవుతున్నది పెద్ద మొత్తంలో ఉంది.
దీంతో ఈ విషయం మీద ఏమి చేయాలన్నది ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది. ఇదిలా ఉంటే కాకినాడ పోర్ట్ లో జరిగే అక్రమ రవాణా మీద పది వేల మంది ఆధారపడి ఉన్నారని అంటున్నారు. ఇక రాజకీయ జీవులతో పాటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆధారపడి ఉన్నారు. ఇది ఒక గొలుసుకట్టు కధలా సాగుతోంది. దాంతో ఎవరూ ఏమీ ప్రస్తుతానికి చేయలేకపోతున్నారు అని అంటున్నారు. మొత్తానికి ద్వారంపూడి పేరు వైసీపీ అధికారం పోయి ఆరు నెలలు అయినా వస్తోంది అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.