యూఎస్ ఎన్నికల్లో కొత్త వ్యూహం.. కమలా హారిస్ కాదు ‘కమల’ మాత్రమే
ఈ ఎత్తుగడకు మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం సూచన చేసినట్లుగా తెలుస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మనమ్మాయి కమలా హారిస్ పేరును ఇక నుంచి మరింత చిన్నది చేసి.. కేవలం కమల పేరుతోనే వ్యవహరించనున్నారు. ఆమె పాల్గొనే ఎన్నికల ప్రచారంలోనూ.. సభల్లోనూ కమల.. కమల అని మాత్రమే పిలవాలని డిసైడ్ చేశారు. ఇదే విషయాన్ని పార్టీ వర్గాలకు స్పష్టం చేశారు. ఇప్పటివరకు కమల హారిస్ అన్న పేరులో చివరి మూడు అక్షరాల్ని వదిలేసి.. కమల పేరునే ఎక్కువగా పిలవాలని డిసైడ్ చేశారు. ఈ పొట్టి పేరుతో ప్రజల్లోకి మరింత వేగంగా దూసుకెళ్లొచ్చన్న ఆలోచనే ప్రధాన కారణం.
ఈ ఎత్తుగడకు మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం సూచన చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు పొట్టి పేరు సాయం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ కొత్త ఎత్తుగడతో ముందుకు వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ మద్దతుదారులంతా ఇక నుంచి కమల.. కమల అన్న పేరుతో నినాదాలు చేస్తూ ప్రచారంలో పాల్గొననున్నారు.
పేరు విషయంలో చేసుకున్న మార్పునకు సానుకూల ఫలితాలు రావటం గమనార్హం. కమలా హారిస్ స్థానే వోన్లీ కమల పేరునే వ్యవహరించాలన్న నిర్ణయాన్ని ప్రకటించిన 48 గంటల్లోనే పార్టీ ప్రచార సోషల్ మీడియాను బిడెన్ హెచ్ క్యూ నుంచి కమలా హెచ్ క్యూకి త్వరగా రీ బ్రాండ్ చేశారు. హారిస్ నుంచి కమలకు మారటం ద్వారా ఓటర్లకు మరింత దగ్గర అవుతారన్న మాట వినిపిస్తోంది.
దీనికి తోడు ఆమె రాజకీయ ప్రత్యర్థి.. అధ్యక్ష ఎన్నికల్లో ఆమెతో ముఖాముఖి పోటీపడుతున్న ట్రంప్ సైతం.. కమలా.. కమలా అని పొట్టిపేరుతో పిలవటం.. ఆమెకు లాభిస్తుందని.. ఆమె పొట్టి పేరు ప్రజల్లోకి మరింత వేగంగా వెలుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఎత్తుగడ ఏమేరకు వర్కువుట్ అవుతుందన్నది మరికొద్ది నెలల్లో తేలి పోనుంది.