జూలు విదిల్చిన మద్యపాన ప్రియులు... ఫ్లైట్లో లక్షల మద్యం హాంఫట్!

ఈ నేపథ్యంలో ఈ ఫ్లైట్ కి సంబంధించిన విషయాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ప్రధానంగా ఈ ఫ్లైట్ లో మద్యపాన ప్రియులు జూలు విదిల్చారని అంటున్నారు.

Update: 2024-12-23 08:51 GMT

గుజరాత్ లో మద్య నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. అరచేతిని అడ్డుపెట్టి సముద్రాన్ని ఆపలేరన్నట్లుగా.. అక్రమ మద్యం వ్యాపారం విరివిగా జరుగుతుంటుందని చెబుతుంటారు. ఆ ఆరోపణల సంగతి అలా ఉంటే... తాజాగా ఆ రాష్ట్రం నుంచి బ్యాంకాక్ వెళ్లిన ఫ్లైట్ లో మాత్రం మద్యం విపరీతంగా ఖర్చయ్యిందని అంటున్నారు.

అవును... గుజరాత్ లోని సూరత్ నుంచి థాయిలాండ్ రాజధాని బ్యాంకాకు కు మొదటి విమానం ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ను ఇటీవల ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ ఫ్లైట్ కి సంబంధించిన విషయాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ప్రధానంగా ఈ ఫ్లైట్ లో మద్యపాన ప్రియులు జూలు విదిల్చారని అంటున్నారు.

ఈ విమానంలో ప్రయాణించిన వారు అధిక మద్యం వినియోగించారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా.. ఆ విమానంలోని ప్రయాణికులు సుమారు 15 లీటర్ల ప్రీమియం మద్యాన్ని లాగించేశారని అంటున్నారు. ఇందులో బకార్డీ, బీర్, చివాస్ రీగల్ వంటివి ఉన్నాయని.. వీటి విలువ 1.8 లక్షల వరకూ ఉంటుందని అంటున్నారు.

దీంతో... ప్రయాణికులు మద్యం ఎక్కువగా వినియోగించడంతో సూరత్ లో బయలుదేరిన ఫ్లైట్ బ్యాంకాక్ చేరేలోపే ‘సరుకు’ ఖాళీ అయిపోయిందని విమాన సిబ్బంది ప్రకటించాల్సి వచ్చిందని అంటున్నారు. మొత్తం మీద నాలుగు గంటల్లో ఈ వ్యవహారం మొత్తం పూర్తైపోయిందని చెబుతున్నారు. ఫుడ్ విషయంలోనూ బాగానే ప్లాన్ చేశారని అంటున్నారు!

ఇందులో భాగంగా... ఈ విమాన ప్రయాణికులు ముఖ్యంగా థెప్లా, ఖమన్ వంటి గుజరాతీ వంటకాలు తీసుకొచ్చారంట. వీటితో పాటు పలువురు పిజ్జాలు గట్రా తెచ్చారని అంటున్నారు. విమానంలో అందించిన డ్రింక్స్ కు ఈ ఫుడ్ కూడా తోడవ్వడంతో ప్ర్యాణికులు జూలు విదిల్చారని.. లీటర్ల మద్యాన్ని పీల్చేశారని కామెంట్ చేస్తున్నారు!

మరోపక్క.. 300 మంది ప్రయాణికుల సంఖ్యపైనా అనుమానాలు వ్యక్త్మవుతున్నాయని అంటున్నారు. ఈ విమానంలో నిజానికి 300 మందిని తీసుకెళ్లలేరని.. గరిష్టంగా 176 మంది మాత్రమే సరిపోతారని అంటున్నారని తెలుస్తోంది. ఈ విధంగా లెక్కలు వేసిన పలువురు.. ఆ లెక్కన చూసుకుంటే సగటున ప్రతీ ప్రయాణికుడికి 85 ఎంఎల్ లిక్కర్ మత్రమే ఖర్చైనట్లని చెబుతున్నారంట.

ఆ సంగతి అలా ఉంటే... ఈ స్థాయిలో గుజరాతీయులు మద్యంపై విరుచుకుపడ్డారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... రాష్ట్రంలో మద్యం నిషేధంపై మరోసారి చర్చ జరగాలని.. గుజరాత్ ప్రజలు మద్యంపై ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టం అవుతోందని నెట్టింట కామెంట్లు దర్శనమిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News