లోక్ స‌భ వార్ లో కంగ‌న‌.. క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లే

600 సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుండ‌టంపై ఆమె కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

Update: 2023-11-03 14:30 GMT

బాలీవుడ్ క్వీన్ కంగ‌న రాజ‌కీయ అరంగేట్రానికి స‌మ‌యం ఆసన్న‌మైందా? కండువా క‌ప్పుకోవ‌డానికి ఆమె కూడా సంసిద్దంగా ఉన్నారా? నిన్న మొన్న‌టివ‌ర‌కూ నో చెప్పిన కంగ‌న మ‌న‌సు ఇప్పుడు రాజ‌కీయాలు బ‌లంగా కోరుకుంటుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. గ‌త రెండు..మూడు నెలల్లోనే రాజకీయ తెరంగేట్రానికి సంబంధించిన ప్ర‌శ్న‌లు ఎదురైన రెండు సంద‌ర్బాల్లోనూ కంగ‌న ఆస‌క్తిక‌రంగా వ్యాఖ్యానించారు.

`చంద్ర‌ముఖి-2` సినిమా ప్ర‌చారంలో భాగంగా రాజ‌కీయాల్లో అవ‌కాశం వ‌స్తే వ‌దులుకోనని వ్యాఖ్యా నించారు. తాను నేను దేశ భ‌క్తురాలిని. అందుకే నా వంతుగా పేద‌ల‌కు తోచిన స‌హాయం చేస్తాన‌ని అన్నారు. అప్పుడీ వ్యాఖ్య‌లు జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అప్ప‌టివ‌ర‌కూ రాజ‌కీయా లంటే? ఎస్కేప్ అయ్యే కంగ‌న తొలిసారి పాజిటివ్ గా మాట్లాడిందేంట‌ని జాతీయ మీడియా పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా కంగ‌న ర‌నౌత్ దేవ‌భూమి ద్వార‌క సాక్షిగా శుక్రవారం రాజ‌కీయాల‌పై సూచనప్రాయంగా వెల్లడించారు. శ్రీకృష్ణ భగవానుడు ఆశీర్వదిస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కంగన ప్రకటించారు. ప్రఖ్యాత ద్వారకాధీశ ఆలయాన్ని శుక్రవారం ఉదయం కంగన సందర్శించారు. ఆలయం వెలుపల ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ నేప‌థ్యంలోనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు శ్రీ కృష్ణ కీ కృపి రహీతో లడేంగే(శ్రీ కృష్ణుడి ఆశీస్సులు ఉంటే పోటీచేస్తా) అంటూ ఆమె జవాబిచ్చారు.

600 సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుండ‌టంపై ఆమె కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. బిజెపి ప్రభుత్వం కృషి కారణంగానే 600 సంవత్సరాల పోరాటం తర్వాత భారతీయులకు ఈ సుదినం రానున్నదని ఆమె అన్నారు. అత్యంత వైభవోపేతంగా అయోధ్య రామాలయాన్ని ప్రారంభించుకుంటామన్నారు. ప్రపంచ మంతటా సనాతన ధర్మం పతాక ఎగరాలని కంగ‌న ఆకాంక్షించారు. అలాగే సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరం శిథిలాలను సందర్శించేందుకు భక్తులకు సౌకర్యం కల్పించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News