రాహుల్ గాంధీ ఒక నెపో కిడ్: కంగన
స్వస్థలం మండి (హిమచల్ ప్రదేశ్) నియోజకవర్గంలో భాజపా తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడింది కంగన రనౌత్
స్వస్థలం మండి (హిమచల్ ప్రదేశ్) నియోజకవర్గంలో భాజపా తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడింది కంగన రనౌత్. రాజకీయాల్లోకి వచ్చాక కంగన స్పీడ్ మరింత పెరిగింది. స్పీచ్‌లలో తనదైన క్రియేటివీటీతో మైమరిపిస్తోంది. వివాదాలు ఎదురవుతున్నా కానీ, దేనికీ వెరవక తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. ఇదంతా ఇలా ఉండగానే, తాజాగా కంగన చేసిన ఓ కామెంట్ కాంగ్రెస్ వర్గీయుల్లో కంపరం పుట్టిస్తోంది.
ప్రతిసారీ ఇండస్ట్రీలో ఆలియా భట్, సోనమ్ కపూర్ లాంటి నెపో కిడ్స్ ని తూర్పారబట్టే కంగన, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని నెపో కిడ్ అంటూ విమర్శించింది. సంజయ్ లీలా భన్సాలీ నటించిన గంగూబాయి కతియావాడి చిత్రానికి గానూ అలియా భట్‌కి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు రావడంపై నెటిజనుల్లో జరిగిన చర్చను ప్రస్థావిస్తూ కంగన రాహుల్ పైనా తీవ్రంగా స్పందించింది.
తాజాగా ఓ సమావేశంలో కంగన వ్యాఖ్య హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ టిక్కెట్‌పై మండి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కంగనాను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తన అభిప్రాయం ఏమిటని అడిగారు. క్వీన్ మాట్లాడుతూ తనదైన శైలిలో సెటైర్లు వేసింది. నేను ఆయనను చిత్ర పరిశ్రమలో 'కింగ్ బేటా'తో పోలుస్తాను. ఒక నిర్మాత తన కూతురికి అవార్డులు ఇచ్చినట్లే.. .ఈసారి అవార్డులన్నీ అతనికే దక్కుతాయి. ''నరాజ్ హో గయీ హై యే (నేను ఆయన(రాహుల్ )ను ఇండస్ట్రీలోని మరో వ్యక్తిగా మాత్రమే చూస్తున్నాను. సినిమా పరిశ్రమకు చెందిన ముద్దుల బిడ్డలా...'' అని వ్యాఖ్యానించింది. తన కూతురికి అవార్డులు ఇచ్చినట్లుగా ఉంది... అని వ్యాఖ్యానించింది. మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్ కి అవార్డులు ఇచ్చినట్టుగానే.. రాహుల్ గాంధీకి కూడా అవార్డులివ్వాలని కంగన సెటైర్ వేసింది. అతడిని ఒక నెపో కిడ్ గా తాను చూస్తున్నానని పరోక్షంగా వ్యాఖ్యానించింది.
మీరు రాజకీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు బాలీవుడ్ నుండి ఎవరైనా శుభాకాంక్షలు చెప్పారా? అని ప్రశ్నించగా.. నేను రాజకీయాల్లోకి రావడంతో బాలీవుడ్‌లోని వారు కూడా సంతోషిస్తున్నారని మాత్రమే కంగన వ్యాఖ్యానించింది. నెపో మాఫియా కు చాలా సంవత్సరాలుగా మంచి సెటప్ ఉంది. కాబట్టి వారు మమ్మల్ని అణచివేయడంలో విజయం సాధించారు అని కూడా కంగన వ్యాఖ్యానించింది. కానీ ఇప్పుడు తాము నిలదొక్కుకున్నామని గుర్తు చేసింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే క్వీన్ కంగన తదుపరి ఎమర్జెన్సీలో కనిపించనుంది.