కేఏ పాల్ కాదు.. ఇకపై విశాఖ పాల్.. రీజన్ ఇదే!

అవును... కేఏ పాల్ విశాఖ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీచేస్తానని చెబుతున్నారు కేఏ పాల్.

Update: 2023-08-04 07:57 GMT

గతంలో మత ప్రభోదకుడుగా రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసిన కేఏ పాల్... కొంతకాలంగా "ప్రజాశాంతి" పార్టీ పెట్టి రాజకీయాల్లో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో ఫుల్ హడావిడి చేసిన ఆయన... ఈసారి ఎంపీగా పోటీచేయనున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం కేఏ పాల్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదనే వారు లేకపోలేదు. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. తనకంటే విశాఖ ఎంపీగా పోటీకి ఎవరు అర్హుడని ప్రశ్నిస్తున్నారు. పైగా తాను పక్కా లోకల్ అని అంటున్నారు.

అవును... కేఏ పాల్ విశాఖ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీచేస్తానని చెబుతున్నారు కేఏ పాల్. ఈ సందర్భంగా అసలు విశాఖ ఎంపీగా పోటీకి తనకంటే ఎవరు అర్హుడని కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తాను విశాఖ వాసినని గుర్తుచేస్తున్నారు.

ఇదే క్రమంలో ఇకపై తాను విశాఖలోనే మకాం పెడతానని, విశాఖలోనే ఉంటూ తన రాజకీయం ఏంటో చూపిస్తానని... ఏపీలోని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు కేఏ పాల్. ఈ సందర్భంగా... ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయని పాల్ తీవ్ర విమర్శలు చేశారు.

కాగా... విశాఖ దగ్గర తగరపువలస పాల్ సొంత ప్రాంతం. దీంతో ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఈ ప్రాంతం సమస్యలు పరిష్కరిస్తానని చెబుతున్నారు. ఇదే క్రమంలో... విశాఖ సమస్యల గురించి తన కంటే ఎక్కువ తెలిసిన వారు లేరని అంటున్నారు.

ఫైనల్ గా... ఆరు నూరైనా నూరు ఆరైనా ఈసారి 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని బల్లగుద్దుతున్నారు కేఏ పాల్. ఇదే సమయంలో తనదే గెలుపు అని.. తాను ఇక మీదట విశాఖ పాల్ ని అని కూడా అంటుండటం గమనార్హం!

Tags:    

Similar News