పవన్ మీద వైసీపీ కంటే ఎక్కువగా ఆయన టార్గెట్...?
ఆయనే ప్రజా శాంతి అధ్యక్షుడు డాక్టర్ కే యే పాల్. ఆయన గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ని చాలా గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఎవరికి టార్గెట్ అంటే రెండవ మాట లేకుండా వైసీపీ నేతలకే అని చెబుతారు. అయితే ఇపుడు వైసీపీ నేతల కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని ఒకాయన టార్గెట్ చేస్తున్నారు. ఆయన జోక్ చేస్తున్నారో అనో మరో విధంగానో లైట్ తీసుకోవడానికి లేదు. ఆయన మత బోధకుడిగా పాపులర్. రాజకీయ నేత అవతారం ఎత్తిన తరువాత ఆయన గత ఐదేళ్లలో బాగానే రాటుదేలారు.
ఆయన గెలుపు సంగతి పక్కన పెడితే ఎలాంటి జంకూ గొంకూ లేకుండా చాలా మంది మీద చేస్తున్న ఆరోపణలు మాత్రం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయనే ప్రజా శాంతి అధ్యక్షుడు డాక్టర్ కే యే పాల్. ఆయన గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ని చాలా గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు.
దానికి కూడా కారణం ఉంది. అందరి మాదిరిగానే ఏపీ పాలిటిక్స్ లో కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేయాలని పాల్ సైతం డిసైడ్ అయినట్లుగా ఉంది అంటున్నారు. ఆయన కూడా పవన్ సామాజికవర్గానికి చెందినవారే. బలమైన సామాజికవర్గం ఏపీలో ఇపుడు సీఎం పదవి ఆకాంక్షతో ఉంది.
అందుకోసమే వారంతా పవన్ చుట్టూ ఆశలు అల్లుకున్నారు. కానీ పవన్ ఎపుడైతే టీడీపీకి పొత్తు అంటూ ప్రకటించారో ఆ సామాజిక వర్గం పూర్తిగా నిరాశకు లోను అయింది. దీంతో పాల్ లాంటి వారు తమ వెంట ఉంటేనే సీఎం పదవి కాపులకు దక్కుతుంది అని అంటున్నారు.
అదే టైం లో ఆయన పవన్ కళ్యాణ్ ని గట్టిగానే తగులుకుంటున్నారు. పవన్ చంద్రబాబు పల్లకీ మోయడమేంటని ఫైర్ అవుతున్నారు. తాజాగా కే యే పాల్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో పవన్ డీల్ కుదుర్చుకున్నారని, అందువల్లనే 1500 కోట్ల రూపాయలను ప్యాకేజీ కింద తీసుకున్నారు అని తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఆ సొమ్ము దుబాయ్, హాంకాంగ్ మీదుగా సింగపూర్ లో ట్రాన్స్ఫర్ అయిందని అంతున్నారు. ఈ ప్యాకేజీ మేరకు జనసేనకు కేవలం 25 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని అంతకే పరిమితం కావాలని కే యే పాల్ అంటున్నారు. టీడీపీతో పొత్తుకు సిద్ధం కావాలని జనసేనలో చెబుతున్నది నాదెండ్ల మనోహార్ అని ఆయన అంటున్నారు.
గతంలో పవన్ టీడీపీ మీద ప్యాకేజీ విమర్శల మీద కామెంట్స్ చేశారని అవన్నీ కూడా పాత వీడియోలు అన్నీ యూ ట్యూబ్ లో ఉన్నాయని ఆయన అంటున్నారు. బిస్కెట్లకు అమ్ముడు పోవడానికి మేము కుక్కలమా అని గతంలో పవన్ అన్నారని, ఇపుడేమంటారు అని పాల్ నిలదీస్తున్నారు.
నిజానికి ఈ తరహా ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తారు. కానీ కే యే పాల్ తన వద్ద ఈ ప్యాకేజీ సమాచారం మొత్తం ఉందంటూ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ మీద గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆయన విమర్శలు ఎన్ని చేసినా జనసేన నుంచి కౌంటర్ అయితే లేదు, కానీ ఇపుడు తీవ్రమైన కామెంట్స్ పాల్ చేశారు. అసలే పొత్తుల విషయంలో జనసేనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న నేపధ్యంలో పాల్ కామెంట్స్ ని జనసేన ఖండించాల్సిన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. మరి అది జరుగుతుందా లేక ఎప్పటిలాగానే పాల్ ని లైట్ తీసుకుని వదిలేస్తారా చూడాల్సి ఉంది అంటున్నారు.