కర్ణాటకలో రాజకీయ కలకలం.. కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు కుట్రలా?!
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక లో కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు శుక్రవారాలు కూడా గడవకముందే.. ఉరుములు లేని పిడుగుల మాదిరిగా ఇప్పుడు రాజకీయ కలకలం రేగింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్రానికి వెలుపల కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఔను.. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు పొరుగు రాష్ట్రాల్లో బీజేపీ చక్రం తిప్పుతోంది. ఏం జరుగుతుందో చూడాలి. అదే జరిగితే..ఈ దేశం లో ప్రజాస్వామ్యం లేనట్టే" అని వ్యాఖ్యానించారు.
వాస్తవానికి ఈ ఏడాది మే నెల లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యతతో అధికారం లోకి వచ్చిన విష యం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో పెద్దలు వచ్చి ప్రచారం చేసినా.. జై బజరంగ బలీ నినాదంతో ఎన్నికల కు పిలుపునిచ్చినా.. ఇక్కడ బీజేపీ ఎత్తులు పారలేదు. అగ్రనేతల ప్రచారాల ను కూడా చిత్తు చేస్తూ.. ఇక్కడ ప్రజలు ఏకపక్షంగా కాంగ్రెస్ కు పట్టం కట్టారు. మొత్తం 224 సీట్లున్న కర్ణాటక విధాన సభలో 135 స్థానాలు కాంగ్రెస్ కొల్లగొట్టింది.
అంత బలంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్నిముచ్చటగా మూడు నెలలు కూడా గడవకముందే.. కూల్చి వేస్తారా? అనే సందేహాలు తెరమీదికి వచ్చాయి. ఇక, కొన్నాళ్లుగా.. బీజేపీ అనుకూల పత్రికలు కూడా.. రాష్ట్రంలో ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదిలావుంటే, తాజాగా డిప్యూటీ సీఎం డీకే చేసిన వ్యాఖ్యల ను సీరియస్ గానే తీసుకోవాల ని అంటున్నారు పరిశీలకులు. తనకు పక్కా సమాచారం లేకుండా. డీకే ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ప్రభుత్వంలోని పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారు.
గతంలో మధ్యప్రదేశ్ లోనూ ఇలానే చేశారని.. అప్పట్లోనూ డీకే హెచ్చరించారని.. గోవాల నూ ఇదే జరిగింద ని.. డీకే చెప్పిన హెచ్చరిక విషయం లో పార్టీ సీరియస్ గానే వ్యవహరిస్తుందని మరికొందరు చెబుతున్నా రు. ఏదేమైనా.. కర్ణాటక లో సర్కారు ను పోగొట్టుకోవడం పై.. బీజేపీ తీవ్రంగా మథన పడింది. అయినా.. ప్రజాతీర్పు భిన్నంగా ఉండడంతో మౌనంగా ఉంది. కానీ, ఇప్పుడు.. డీకే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.