బెంగళూరులోని టెక్కీలకు బ్యాడ్ న్యూస్... కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం!

అవును.. గత కొంత కాలంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారని.. ఇదే క్రమంలో బెంగళూరు నగరాన్ని తీవ్ర నీటి ఎద్దడి వెంటాడుతోందని చెబుతున్నారు.

Update: 2024-04-17 23:30 GMT

టెక్కీలు తమ తమ రంగాలతో పాటు.. పని ఒత్తిడితో అనేక రకాల మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటుంటారని చెబుతుంటారు! ప్రధానంగా ఎక్కువ పని గంటలతో పాటు.. టార్గెట్స్ ఫినిష్ చేయడం వంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. ఈ క్రమంలో ఉన్న సమస్యలతో పాటు ఇప్పుడు మరో సరికొత్త సమస్య వచ్చిందని చెబుతున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం టెక్కీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.

అవును.. గత కొంత కాలంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారని.. ఇదే క్రమంలో బెంగళూరు నగరాన్ని తీవ్ర నీటి ఎద్దడి వెంటాడుతోందని చెబుతున్నారు. ఈ ఏడాది వేసవి ప్రారంభమైన కొద్ది వారాల్లోనే నీటి కటకటలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో బెంగళూరు నగరంలో నివసిస్తున్న, ప్రధానంగా అక్కడే స్థిరపడిన టెక్కీలకు చేదు వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఇందులో భాగంగా... కర్ణాటకలో మరో నగరాన్ని కొత్త ఐటీ హబ్‌ గా తీర్చిదిద్దాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో... అటు ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు సైతం నీటి కొరత, ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇటీవల కర్ణాటకలోని ఇతర నగరాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాయని చెబుతున్నారు. ఈ క్రమంలో టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఇన్వెంచర్ టెక్నాలజీ వంటి ప్రధాన కంపెనీలు ఇప్పటికే మంగుళూరుకు షిఫ్ట్ అయినట్లు చెబుతున్నారు.

ఇటీవలే టెక్ మహీంద్రా తన శాటిలైట్ కార్యాలయాన్ని మంగళూరులో ప్రారంభించగా.. పలు బడా కంపెనీల దృష్టి మంగళూరు వైపు మళ్లిందని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ నాలుగైదు ఐటీ పార్కులు ఏర్పాటు కానున్నాయని చెబుతున్నారు. రాబోయే కొన్నేళ్లలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అత్యుత్తమ స్కిల్ కలిగిన టెక్కీలు ఉన్న నగరాల్లో ఒకటిగా మంగళూరు రూపుదిద్దుకోనుందని అంచనా వేస్తున్నారు.

అయితే... బెంగళూరు నుంచి మంగుళూరుకు మారడం వల్ల కొత్త టెక్కీలకు ట్రాఫిక్ సమస్యలు వంటివి ఉండకపోవచ్చు, కాస్త తక్కువ ధరకే అద్దెకు ఇల్లు దొరకొచ్చు కానీ... ఇప్పటికే బెంగళూరులో సెటిల్ అయిన టెక్కీలకు మాత్రం ఇది కచ్చితంగా బ్యాడ్ న్యూసే అని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News