ఏపీలో కర్ణాటక మద్యం... ముగ్గురు అరెస్ట్.. ట్విస్ట్ ఇదే!!

ప్రస్తుతం మధ్యపాన నిషేదంలో భాగంగా దశలవారీగా షాపుల సంఖ్య తగ్గిస్తూ.. ధరలు పెంచుతూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Update: 2023-09-08 09:19 GMT

ప్రస్తుతం మధ్యపాన నిషేదంలో భాగంగా దశలవారీగా షాపుల సంఖ్య తగ్గిస్తూ.. ధరలు పెంచుతూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో కొంతమంది మహిళలు హ్యాపీగా ఉండగా.. మరికొంతమంది మందుబాబులు మాత్రం కొత్త దారులు వెతుకుతున్నారు.

ఇలా తక్కువధరకు మద్యం దొరికే మార్గాల కోసం చూస్తున్న మందుబాబులకు పక్కనే ఉన్న కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమంంగా తరలిస్తున్న మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో అక్రమంగా మద్యం తరలించేవారు చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో ఇలా చెలరేగిపోయిన ఒక బ్యాచ్ తాజాగా సెబ్ అధికారులకు దిరికిపోయింది.

అవును... పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మద్యం ధరలు ఏపీతో పోలిస్తే కాస్త తక్కువగా వుండటంతో కొంతమంది దీన్ని ఆదాయమార్గంగా మార్చుకున్నారు. ఈ రాష్ట్రాల మద్యం అక్రమంగా ఏపీకి తరలించి గుట్టుగా అమ్ముతున్నారు. ఇలా అన్నమయ్య జిల్లాలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు.

కురబలకోట అంగళ్లులో తనిఖీలు నిర్వహించగా కర్ణాటక మద్యంతో పాటు నిందితులు ముగ్గురు పట్టుబడ్డారు! వీరికి కర్ణాటకకు చెందిన ఒకవ్యక్తి సహకరిస్తున్నట్లు గూర్తించారు. దీంతో ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసిన అధికారులు.. పక్క రాష్ట్రం మద్యంతో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీళ్లను కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది.

అయితే ఇలా పట్టుబడిన ముగ్గురిలో ఇద్దరు పురుషులు కాగా.. మరొకరి ఒక మహిళ. అయితే ఈమె ఒక వాలంటీర్ అని తెలుస్తుంది!

Tags:    

Similar News